Bihar: కులాల రిజర్వేషన్లను 75 శాతానికి పెంచే బిల్లును ఆమోదించిన బీహార్ అసెంబ్లీ
బీహార్ అసెంబ్లీ గురువారం రిజర్వేషన్ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటాను ప్రస్తుతమున్న 50 శాతం నుంచి మొత్తం 75 శాతానికి పెంచే ప్రతిపాదనను బీహార్ కేబినెట్ ఆమోదించింది.
Bihar: బీహార్ అసెంబ్లీ గురువారం రిజర్వేషన్ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటాను ప్రస్తుతమున్న 50 శాతం నుంచి మొత్తం 75 శాతానికి పెంచే ప్రతిపాదనను బీహార్ కేబినెట్ ఆమోదించింది.
కులాల రిజర్వేషన్ల పెంపు.. (Bihar)
కులగణణ సర్వే ఫలితాల ఆధారంగా, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ OBCలు మరియు EBS రిజర్వేషన్లను 30 శాతం నుండి 43 శాతానికి, షెడ్యూల్డ్ కులాలకు (SC) 16 శాతం నుండి 20 శాతానికి మరియు షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) 1 శాతం నుండి 2 శాతానికి పెంచాలని సిఫార్సు చేశారు.ఈడబ్ల్యూఎస్ కోటా ప్రస్తుతమున్న 10 శాతంలోనే ఉంటుంది. రాష్ట్రంలోని మొత్తం 13.07 కోట్ల మందిలో ఓబీసీలు (27.13 శాతం), అత్యంత వెనుకబడిన తరగతుల ఉప సమూహం (36 శాతం) 63 శాతం మంది ఉన్నారని, ఎస్సీ, ఎస్టీలు కలిపి 21 శాతం కంటే కొంచెం ఎక్కువగా ఉన్నారని కుల సర్వే నివేదిక వెల్లడించింది.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి అసెంబ్లీలో సమర్పించిన నివేదిక ప్రకారం, రాష్ట్రంలో దాదాపు 2.97 కోట్ల కుటుంబాలు ఉన్నాయి, అందులో 94 లక్షలకు పైగా (34.13 శాతం) నెలకు రూ. 6,000 లేదా అంతకంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు.. నిరుపేదలు, ఇళ్లు లేనివారు మరియు భూమిలేని వారిని లక్ష్యంగా చేసుకునే సంక్షేమ పథకాల కోసం కుల గణనలోని డేటా 5 సంవత్సరాలలో 2.5 ట్రిలియన్ రూపాయలను అందిస్తుంది. ప్రత్యేక రాష్ట్ర హోదా వల్ల అదనపు ప్రయోజనాలు పొందవచ్చు అని సీఎం నితీశ్ కుమార్ అన్నారు.