Suicide : ఫోన్ పక్కన పెట్టి చదువుకోమన్నందుకు.. ఆత్మహత్య చేసుకున్న 15 ఏళ్ల విద్యార్ధి
ప్రస్తుత కాలంలో చిన్నవారి నుంచి పెద్దవాళ్ల వరకూ చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే పొద్దు గడవకుండా ఉంది. ఏదైనా అవసరానికి మించి వినియోగిస్తే ప్రమాదమే అని ఎప్పుడు మన పెద్దలు మనకి చెబుతూనే ఉంటారు. మరి ముఖ్యంగా ఫోన్ వినియోగం లో ఈ మాట వాస్తవం అని చెప్పవచ్చు. మొబైల్ ని ఆదాయ వనరుగా మార్చుకొని
Suicide : ప్రస్తుత కాలంలో చిన్నవారి నుంచి పెద్దవాళ్ల వరకూ చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే పొద్దు గడవకుండా ఉంది. ఏదైనా అవసరానికి మించి వినియోగిస్తే ప్రమాదమే అని ఎప్పుడు మన పెద్దలు మనకి చెబుతూనే ఉంటారు. మరి ముఖ్యంగా ఫోన్ వినియోగం లో ఈ మాట వాస్తవం అని చెప్పవచ్చు. మొబైల్ ని ఆదాయ వనరుగా మార్చుకొని సంపాదన కోసం వినియోగించుకునే వారు ఒక వైపు ఉంటే.. మరోవైపు చెడు పనుల కోసం ఉపయోగించే వారు కూడా ఎక్కువయ్యారు. అయితే ఫోన్ కోసం జరిగిన కొన్ని దారుణ ఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మనం చదవబోయే ఈ ఘటన కూడా ఆ కోవలోకే వస్తుంది.
కర్ణాటక లో మొబైల్ ఫోన్ లో ఎక్కువ సమయం గడుపుతున్న తనయుడిని తల్లిదండ్రులు మందలించడంతో సూసైడ్ చేసుకున్నాడు. ఓ యువకుడు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్ లో ఏదొకటి చూస్తూ ఉండడాన్ని గమనించిన తల్లిదండ్రులు.. ఫోన్ పక్కకు పట్టి చదువుపై దృష్టి పెట్టు అని సూచించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే..
చిక్కబళ్లాపూర్ జిల్లా గౌరిబిదనూరు సమీపంలోని చిట్టవలహళ్లి గ్రామానికి చెందిన లోకేష్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అతని వయస్సు 15 సంవత్సరాలు. ఆదివారం తనను ఫోన్ పక్కకు పెట్టి.. చదువుకోమని తల్లిదండ్రులు చెప్పడంతో కోపంతో ఇంటికి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అనంతరం సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కొడుకు మొబైల్ ఫోన్లలో కాలక్షేపం చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు కోరినట్లు తెలిపారు. క్షణికావేశంలో ఇటువంటి పొరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని.. ఆత్మహత్య అనేది ఎప్పటికీ సరైన నిర్ణయం కాదని మరొక్కసారి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని మనవి. ప్రాణం ఎంతో అమూల్యమైనది..