Nara Chandrababu Naidu : హైదరాబాద్ కు రానున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు.. ఎప్పుడు, ఎందుకంటే ?
తెదేపా అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ పై విడుదలై ఈరోజు హైదరాబాద్ కు వస్తున్నారు. రాజమండ్రి నుంచి సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఉదయం 6 గంటల సమయంలో ఆయన అమరావతిలోని ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. కాగా ఉండవల్లి నివాసం నుండి ఇవాళ మద్యాహ్నం చంద్రబాబు హైదరాబాద్
Nara Chandrababu Naidu : తెదేపా అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ పై విడుదలై ఈరోజు హైదరాబాద్ కు వస్తున్నారు. రాజమండ్రి నుంచి సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఉదయం 6 గంటల సమయంలో ఆయన అమరావతిలోని ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. కాగా ఉండవల్లి నివాసం నుండి ఇవాళ మద్యాహ్నం చంద్రబాబు హైదరాబాద్ కు పయనం కానున్నారు. మద్యాహ్నం 3 గంటలకు ఉండవల్లి నివాసం నుండి బయలుదేరి 3.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు. అక్కడి నుండి ప్రత్యేక విమానంలో 4.45 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారని ఏపీ పోలీసులు వెల్లడించారు.
ఇక శంషాబాద్ విమానాశ్రయం నుండి 5 గంటలకు బయలుదేరతారు. 5.50 గంటలకు జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చంద్రబాబు చేరుకోన్నారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాక వైద్య పరీక్షల కోసం చంద్రబాబు వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ కు వెళ్లేముందు సతీసమేతంగా తిరుమలకు వెళ్లి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని చంద్రబాబు భావించారు. కారణమేంటో తెలీదుగానీ చంద్రబాబు తిరుమల పర్యటన అర్దాంతరంగా రద్దయ్యింది. దీంతో మద్యాహ్నం వరకు ఉండవల్లి నివాసంలోనే ఉండనున్న చంద్రబాబు సాయంత్రానికి హైదరాబాద్ కు చేరుకున్నారు.
చంద్రబాబు నాయడు జైలునుండి విడుదలై వస్తున్న నేపథ్యంలో ఘనస్వాగతం పలికేందుకు తెలంగాణ టిడిపి నాయకులు సిద్దమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయం బయటే చంద్రబాబును కలిసేందుకు సిద్దమయ్యారు. చంద్రబాబు వెంటే టిడిపి నాయకులు, కార్యకర్తలు జూబ్లీహిల్స్ లోని ఇంటివరకు చేరుకోనున్నట్లు సమాచారం అందుతుంది. రిమాండ్ ఖైదీగా ఉన్నచంద్రబాబుకు నాలుగు వారాలపాటు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం షరతులతో కూడిన మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని అనుబంధ పిటిషన్ వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఇస్తూ తీర్పు వెల్లడించారు.
చంద్రబాబు నేటి షెడ్యూల్..
మధ్యాహ్నం 3 గంటలకు – ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరనున్న చంద్రబాబు
3.45 గంటలకు – గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
4.00 గంటలకు – గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి పయనం
4.45 గంటలకు – హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు
5 గంటలకు – ఎయిర్ పోర్టు నుంచి జూబ్లీహిల్స్ లోని నివాసానికి పయనం
5.50 గంటలకు – ఇంటికి చేరుకోనున్న చంద్రబాబు