Nagam Janardhan Reddy: కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో మనస్థాపం చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి పంపించారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశానని అయినా ఆశ్చర్యకరంగా తనకి టికెట్ నిరాకరించారని నాగం జనార్దన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Nagam Janardhan Reddy: అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో మనస్థాపం చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి పంపించారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశానని అయినా ఆశ్చర్యకరంగా తనకి టికెట్ నిరాకరించారని నాగం జనార్దన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
బాధని, అవమానాన్ని కలిగించింది..(Nagam Janardhan Reddy)
ఇది తనకి బాధని, అవమానాన్ని కలిగించిందని నాగం లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ బిఆర్ఎస్ అభ్యర్థికి మధ్య అవగాహన కుదిరిందని పలువురు అనుమానిస్తున్నారని నాగం అన్నారు..ఎటువంటి కారణం లేకుండా నాకు టిక్కెట్ నిరాకరించా,రు. టిక్కెట్ కేటాయించే ముందు నన్నుఎప్పుడూ సంప్రదించలేదు, ఇది నాకు చాలా బాధను, అవమానాన్ని కలిగించిందని ఆయన అన్నారు. ఈ ఏడాది ఆగస్టు 3న కాంగ్రెస్‌లో చేరిన తన కుమారుడు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్‌రెడ్డికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కే దామోదర్ రెడ్డి టికెట్ ఇప్పించగలిగారు.నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ప్రజలకు డాక్టర్ రాజేష్ రెడ్డి ఏనాడూ సేవ చేయలేదని, రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టారని ఆయన పేర్కొన్నారు. తన తండ్రి అధికార బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీగా ఉండగా ఆయనకు ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారనేది షాకింగ్. నాగర్‌కర్నూల్ జిల్లాలోని మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ అప్రజాస్వామిక వైఖరితో నిరుత్సాహానికి గురయ్యారని నాగం తన లేఖలోపేర్కొన్నారు.
తన భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలతో సమావేశమై ఒకటి రెండు రోజుల్లో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని నాగం తెలిపారు. అయితే ఆయన ఇంటికి కెటిఆర్, హరీష్‌తోపాటు పలువురు బిఆర్ఎస్ నేతలు వెళ్లి తమ పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించారు. త్వరలోనే బీఆర్ఎస్ లో చేరతానని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు అవమానం జరిగిందని.. అందుకే పార్టీ వీడానని చెప్పారు.నాగం జనార్దన్ రెడ్డి మొదట్నుంచీ తెలంగాణ వాది అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ తో నాగంకు మంచి అనుబంధం ఉందన్నారు.కేసీఆర్ సూచనతో నాగంను పార్టీలోకి ఆహ్వానించామన్నారు.