Last Updated:

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారి ఆస్తి వివాదం పరిష్కారం అవుతుందని తెలుసా..!

జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారి ఆస్తి వివాదం పరిష్కారం అవుతుందని తెలుస్తుంది. అలాగే అక్టోబర్ 27 న  రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారి ఆస్తి వివాదం పరిష్కారం అవుతుందని తెలుసా..!

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారి ఆస్తి వివాదం పరిష్కారం అవుతుందని తెలుస్తుంది. అలాగే అక్టోబర్ 27 న  రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

ముఖ్యమైన పనులు పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. తల్లితండ్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

వృషభం..

వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య భంగమేమీ ఉండదు. ఉద్యోగం మారే ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన శుభ వార్తలు వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.

మిథునం..

ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి. ప్రయాణాల వల్ల ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటకం..

ఆర్థిక వ్యవహారాలను సజావుగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో సహచరులతో సమస్యల నుంచి బయటపడకా సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు కొత్త అవకాశాలు అందివస్తాయి.  దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

సింహం..

అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. సతీమణికి వృత్తి, ఉద్యోగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. బంధువులతో అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ప్రస్తుతానికి ఫలించకపోవచ్చు.

కన్య..

ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగు లకు సమయం అనుకూలంగా ఉంది.

తుల..

ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల మీద బాగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. సతీమణి సహకారంతో కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు.  బంధువుల నుంచి శుభవార్త అందుతుంది.

వృశ్చికం..

వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఏ విషయంలోనూ తొందరపాటుతో వ్యవహరించవద్దు. ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వర్తిస్తారు. వ్యాపారాలు కలిసి వస్తాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

ధనస్సు..

కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి సమస్యేమీ ఉండదు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. విదేశాల నుంచి కూడా ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది.

మకరం..

ముఖ్యమైన లక్ష్యా లను సకాలం పూర్తి చేస్తారు.చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులు ఆశించిన సమాచారం అందుకుంటారు. ఎవరి విషయాల్లోనూ తలదూర్చవద్దు. ఎవరికీ హామీలు ఉండడం కానీ, వాగ్దానాలు చేయడం కానీ చేయవద్దు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

కుంభం..

వ్యక్తిగత సమస్యలకు, కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి.

మీనం..

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు కార్యసిద్ధి లభిస్తుంది.  సతీమణికి వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యం పరవా లేదు.