Elon Musk : ఒక్క రోజు లోనే 13 లక్షల కోట్లు కోల్పోయిన ఎలాన్ మస్క్.. కారణం ఏంటంటే ?
ప్రపంచ కుభేరుడు, ట్విట్టర్ అధినేత, ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధినేత.. ఎలాన్ మస్క్ కి ఊహించని షాక్ తగిలింది. ప్రపంచ సంపన్నుల జాబితాలో అగ్ర స్థానంలో ఉన్న ఆయనకు ఊహించని షాక్ తగిలింది. కేవలం ఒకక్ రోజులోనే ఆయన ఏకంగా 16.1 బిలియన్ డాలర్ల మేర ఆయన నష్టాన్ని చవిచూశారు.
Elon Musk : ప్రపంచ కుభేరుడు, ట్విట్టర్ అధినేత, ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధినేత.. ఎలాన్ మస్క్ కి ఊహించని షాక్ తగిలింది. ప్రపంచ సంపన్నుల జాబితాలో అగ్ర స్థానంలో ఉన్న ఆయనకు ఊహించని షాక్ తగిలింది. కేవలం ఒకక్ రోజులోనే ఆయన ఏకంగా 16.1 బిలియన్ డాలర్ల మేర ఆయన నష్టాన్ని చవిచూశారు. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.13 లక్షల కోట్ల మేర సంపదను కోల్పోయారు.
ఈ షాకింగ్ ఘటనలో వివరాల్లోకి వెళ్తే.. 209.6 బిలియన్ డాలర్లతో ప్రపంచ సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న వ్యక్తి ఎలాన్ మస్క్. అయితే మూడో త్రైమాసిక ఫలితాల్లో టెస్లా కంపెనీ ఆశించిన మేర రాణించలేకపోవడంతో కంపెనీ శషర్ వాల్యూ పడిపోయింది. కార్ల విక్రయాలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కంపెనీ షేర్ల విక్రయానికి ఇన్వెస్టర్లు మొగ్గుచూపారు. ఫలితంగా 9.3 శాతం మేర షేర్లు పతనమయ్యాయి. ఈ ప్రభావం ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపదపై గట్టిగానే ప్రభావం చూపింది.
దాంతో ఆయన 16.1 బిలియన్ డాలర్ల మేర నష్టపోవాల్సి వచ్చింది. కాగా ఎలాన్ మస్క్ సంపదలో టెస్లా వాటా దాదాపు 13 శాతంగా ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. గురువారం భారీ నష్టాన్ని చవిచూసినప్పటికీ మస్క్ సంపన్నుల జాబితాలో అగ్ర స్థానంలో కనసాగుతూనే ఉన్నారు.