Last Updated:

Bhagavanth Kesari Movie Review : నందమూరి బాలకృష్ణ “భగవంత్ కేసరి” మూవీ ఎలా ఉందంటే.. ?

Bhagavanth Kesari Movie Review : నందమూరి బాలకృష్ణ “భగవంత్ కేసరి” మూవీ ఎలా ఉందంటే.. ?

Cast & Crew

  • నందమూరి బాలకృష్ణ (Hero)
  • కాజల్ అగర్వాల్ (Heroine)
  • శ్రీలీల, అర్జున్ రాంపాల్, జాన్ విజయ్, రాజ్ తిరందాసు తదితరులు (Cast)
  • అనిల్ రావిపూడి (Director)
  • సాహు గారపాటి, హరీష్ పెద్ది (Producer)
  • ఎస్ఎస్ తమన్ (Music)
  • సి. రామ్ ప్రసాద్ (Cinematography)
2.7

Bhagavanth Kesari Movie Review : నందమూరి నటసింహం బాలకృష్ణ.. అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకొని మంచి ఫయమలో ఉన్నారు. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ కి కన్నేశారు బాలయ్య. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం “భగవంత్ కేసరి”. ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటించగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్ర చేసింది. అలానే బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా చేశారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించగా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ బడ్జెట్ తో నిర్మించారు. బాల‌య్య గ‌త చిత్రాలు అఖండ‌, వీర సింహ‌రెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల‌ కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలవగా.. బాలకృష్ణ తన వయసుకు తగ్గ పాత్ర చేయడం, అనిల్ రావిపూడి కామెడీ కాకుండా కొత్తగా ట్రై చేయడం ఏ మేరకు వర్కవుట్ అయ్యిందో అని ప్రేక్షకులు అంతా ఎదురు చూస్తున్నారు.  మరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో మీకోసం ప్రత్యేకంగా రివ్యూ, రేటింగ్..

సినిమా కథ.. 

నేలకొండ భగవంత్ కేసరి (నందమూరి బాలకృష్ణ) వరంగల్ జైల్లో ఖైదీ. తన తల్లి చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు చివరగా.. కొడుకుని చూడాలని కోరుకుంటుంది. దీంతో రూల్స్ బ్రేక్ చేసి భగవంత్ ని  జైలర్ శ్రీకాంత్ (శరత్ కుమార్) బయటకు తీసుకెళ్తాడు. దాంతో ఆయన సస్పెండ్ అయినప్పటికీ.. వెళ్ళేముందు సత్ప్రవర్తన కారణంగా భగవంత్ ని రిలీజ్ చేస్తాడు. అయితే జైలు నుంచి విడుదల అయ్యాక శ్రీకాంత్ ఇంటికి వస్తాడు భగవంత్ కేసరి. అదే రోజు యాక్సిడెంట్ లో మరణించడం.. శ్రీకాంత్ కూతురు విజ్జీ పాప (శ్రీలీల) బాధ్యత భగవంత్ కేసరి తీసుకోవడం జరుగుతాయి. మరి తండ్రి కోరిక మేరకు విజ్జీని ఆర్మీలో జాయిన్ చేయాలనుకున్న కోరికను భగవంత్ నెరవేర్చగలిగాడా.. విజ్జీ పాప కి – రాహుల్ సంఘ్వి (అర్జున్ రాంపాల్) మధ్య గొడవ ఏంటి ? భగవంత్ కేసరికి, రాహుల్ సంఘ్వికి ఉన్న పాత గొడవ ఏంటి? మరి చివరకు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడక తప్పదు..

మూవీ విశ్లేషణ (Bhagavanth Kesari Movie Review)..

ముందుగా బాలయ్య సినిమా అంటే లాజిక్స్ గురించి మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేసి రావడం అని ప్రేక్షకులు కూడా ఫీల్ అవుతారు. బాలయ్య డైలాగ్స్, ఫైట్స్, డాన్స్ లు ఇక నెక్స్ట్ లెవెల్.. అలాంటిది ఒక డిఫరెంట్ జోనర్ డైరెక్టర్ తో ఆయన మూవీ అంటే అందరికీ ముందుగా ఆశ్చర్యం వేసింది. అనిల్ రావిపూడి బలం కామెడీ. కానీ తను ఇప్పటి వరకు చేసిన సినిమాల లాగా కాకుండా మాస్ మూవీ తీశారు. యాక్షన్ ఒక్కటే కాకుండా ఎమోషన్ ని కూడా మిక్స్ చేసి గట్టి ప్రయత్నమే చేశాడు. ఇక బాలకృష్ణ కూడా తన పంథాని మార్చి తన ఏజ్ కి సరిపోయే పాత్రలో నటించడం గమనార్హం.

మూవీ విషయనికి వస్తే.. సినిమా స్టోరీ చాలా రొటీన్. విలన్ కారణంగా ఊరికి దూరమైన హీరో.. తన బతుకు తాను బతకడం. అనుకోకుండా అతని జీవితంలోకి మళ్లీ విలన్ రావడం.. చివరికి హీరో విలన్ ని ఓడించడం.. ఇదే కథ. కానీ ఆ కథని డీల్ చేసిన విధానం, స్క్రీన్ ప్లే ఈ సినిమాని ఇంకొంచెం బెటర్ గా చూపించాయి. సినిమాలో ప్రథమార్థం చాలా స్లోగా సాగుతుంది. ఇంట్రడక్షన్ ఫైట్, ఆ తర్వాత శరత్ కుమార్, చిన్నప్పటి విజ్జీ పాప నేపథ్యంలో వచ్చే సీన్లు చాలా సమయం తీసుకున్నాయి. విజ్జీ, భగవంత్ కేసరిల మధ్య బలమైన కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలని 40 నిమిషాల సమయం తీసుకున్నాడు.

ఇక అర్జున్ రాంపాల్ పాత్ర పరిచయం చేసే సీన్లు, శ్రీలీల వెంట అర్జున్ రాంపాల్ మనుషులు పడటానికి కారణం ఫాస్ట్ గా అయిపోతాయి. ఇంటర్వెల్‌కు హీరో, విలన్ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడంతో సినిమా స్పీడ్ అందుకొని హైవోల్టేజ్ మాస్ యాక్షన్ సీన్‌తో ఇంటర్వల్ పడుతుంది. ఇక సెకండాఫ్ లో హీరో, విలన్ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్.. రెండు సర్ ప్రైజ్ లు ఎమోషన్, యాక్షన్, ఎలివేషన్ల మధ్య పరుగులు పెడుతూనే ఉంటుంది. ప్రీక్లైమ్యాక్స్‌కు చేరుకునే సరికి కథ పూర్తిగా యాక్షన్ టర్న్ తీసుకుంటుంది. ఇక క్లైమ్యాక్స్ మళ్లీ ఒక సర్‌ప్రైజ్ కూడా ఉంటుంది.

ఎవరెలా చేశారంటే.. 

ఇక నటీనటుల విషయానికి వస్తే.. బాలయ్య పెర్ఫార్మెన్స్ తో మరోసారి మెప్పించారు. పంచ్ డైలాగ్ లు లేకపోయినా కానీ పంచ్ లు మాత్రం గట్టిగానే ఇచ్చారు. శ్రీలీల.. యాక్టింగ్ అదరగొట్టింది. కాజల్ అగర్వాల్ కొన్ని సీన్లకు మాత్రమే పరిమితం అయ్యింది. అర్జున్ రాంపాల్ విలన్ గా పరవాలేదు. తమన్ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

కంక్లూజన్.. 

డిఫరెంట్ బాలయ్య.. ఓకే అనొచ్చేమో

ఇవి కూడా చదవండి: