Megastar Chiranjeevi : 25 వసంతాలు పూర్తి చేసుకున్న చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్.. మెగాస్టార్ స్పెషల్ ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. కాగా సామాజిక కార్యక్రమాలను సైతం నిర్వహిస్తూ ఎందరికో ఆదర్శంగా ఉంటున్నారు. ఇక ఇప్పటికే చిరంజీవి చారిటబుల్ ఫౌండేషన్ క్రింద ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా లక్షలాది మందికి రక్తదానం, నేత్ర దానం చేపడుతూ వస్తున్నారు.
Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. కాగా సామాజిక కార్యక్రమాలను సైతం నిర్వహిస్తూ ఎందరికో ఆదర్శంగా ఉంటున్నారు. ఇక ఇప్పటికే చిరంజీవి చారిటబుల్ ఫౌండేషన్ క్రింద ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా లక్షలాది మందికి రక్తదానం, నేత్ర దానం చేపడుతూ వస్తున్నారు. ఆయన చేసిన సేవలకు గాను పలు అవార్డులను అందుకోవాడమే కాకుండా అవసరంలో ఉన్న ఎందరికో చేయూతగా నిలిచారు.
కాగా 1998 అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించారు. ఈ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేదలకు సాయం చేశారు. ఈ ట్రస్ట్ తరఫున బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఆయన అభిమానుల ద్వారా సేకరించిన రక్తాన్ని ఆపదలో ఉన్నవారికి అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతగా రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కు ‘బెస్ట్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్’ అవార్డును అందించింది. ఆ తర్వాత 2006లో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను.. చిరంజీవి ఛారిటబుల్ ఫౌండేషన్ గా మార్చారు.
అప్పటి నుంచి బ్లడ్ బ్యాంక్ తో పాటు ఐ బ్యాంక్ ని ప్రారంభించి వారి సేవలను మరింతగా విస్తరిస్తూ వచ్చారు. ఇక ఇటీవల కరోనా కష్ట కాలంలో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ పేరుతో ఈ సేవా కార్యక్రమాలను కొనసాగించారు. కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు నిత్యవసర సరుకులు అందించారు. అయితే తాజాగా నేడు గాంధీ జయంతిని పురస్కరించుకొని మెగాస్టార్ (Megastar Chiranjeevi) ఒక ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ లో.. దేశానికి ముఖ్యమైన ఈ గాంధీ జయంతి రోజున.. నేను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (సిసిటి)ను ఏర్పాటు చేశాను. ఈ ట్రస్ట్ 25 సంవత్సరాల ఎంతో అద్భుతమైన ప్రయాణాన్ని నేటితో పూర్తి చేసుకుంది. ఈ ట్రస్ట్ ద్వారా 10 లక్షలకు పైగా రక్త యూనిట్లు సేకరించి పేదలకు అందించామని.. నేత్రదానం ద్వారా 10 వేల మందికి పైగా కంటి చూపును తీసుకొచ్చామని.. కరోనా మహమ్మారి కాలంలో వేలాది మంది ప్రాణాలు రక్షించామణి అన్నారు. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలో ఉన్న తృప్తి చాలా అమూల్యమైనదని.. ఈ ట్రస్టు ద్వారా సేవలను కొనసాగించడానికి అండగా నిలిచిన లక్షలాది మంది సోదరులు, సోదరీమణులకు సెల్యూట్ చేస్తున్నాను. ఈ ట్రస్ట్ సేవల ద్వారా ఇదే మహాత్ముడికి మనం అర్పించే నివాళి అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
On this important day for our country,
I also fondly reflect on Chiranjeevi Charitable Trust( CCT)’s humble beginnings and its amazing journey of 25 years.Over 10 lakh blood 🩸 units collected and distributed to the needy and
eye 👁️ sight restored to over 10 thousand people… pic.twitter.com/UeVzCB58cp— Chiranjeevi Konidela (@KChiruTweets) October 2, 2023