Last Updated:

Pawan Kalyan : ఆడబిడ్డలపై సాగుతున్న దురాగతాల గురించి స్పందించాల్సిన బాధ్యత లేదా? – పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు పాలకపక్షం, మహిళా కమిషన్ ఎందుకు మౌనంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ తరుపున ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డల అదృశ్యం గురించి

Pawan Kalyan : ఆడబిడ్డలపై సాగుతున్న దురాగతాల గురించి స్పందించాల్సిన బాధ్యత లేదా? – పవన్ కళ్యాణ్

Pawan Kalyan : రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు పాలకపక్షం, మహిళా కమిషన్ ఎందుకు మౌనంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ తరుపున ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డల అదృశ్యం గురించి మాట్లాడగానే హాహాకారాలు చేసిన పాలక పక్షం, మహిళా కమిషన్ – రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు మౌనం వహిస్తోందన్నారు.

ఈ దురాగతాలపై స్పందించాల్సిన బాధ్యత లేదా ? అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థిని కిరాతకంగా హత్యకు గురైతే ముఖ్యమంత్రి గానీ, హోమ్ శాఖ మంత్రి గానీ, మహిళా కమిషన్ బాధ్యురాలు గానీ ఎందుకు స్పందించటం లేదని నిలదీశారు. అనుమానాస్పద మృతి అంటూ పోలీసు అధికారులు దురాగతం తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయని మండిపడ్డారు.

ఆ బాలిక తల్లితండ్రుల ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన వాపోయారు. అలానే విజయనగరం జిల్లా లోతుగెడ్డలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం ఘటన కూడా కలచి వేసిందని.. మైనర్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అంటే రాష్ట్రంలో ఆడ బిడ్డలకు రక్షణ, శాంతి భద్రతల స్థితి ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతోందని నిస్సహాయత వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడ బిడ్డలకు, మహిళలకు రక్షణ కరవైంది అనే మాట వాస్తవమని.. మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించకుండా పోలీసుల చేతులు కూడా పాలక పక్షం కట్టిస్తోందని దుయ్యబట్టారు.

దిశ చట్టాలు చేశాం, దిశ పోలీస్ స్టేషన్లు పెట్టాం అనే పాలకుల ప్రకటనలు ఏ మాత్రం రక్షణ ఇవ్వడం లేదని.. వైసీపీ ప్రభుత్వానికి మహిళల రక్షణపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలని కొరారు. ప్రస్తుతం పవన్ పోస్ట్ చేసిన ఈ  ప్రెస్ నోట్ ను జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేస్తూ పవన్ (Pawan Kalyan) కు మద్దతు తెలుపుతూ.. బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

 

Image