AP Assembly Day 2 : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు ముదిరిన రగడ.. బాలయ్య వర్సెస్ అంబటి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా రసాభాసగా మారింది. చంద్రబాబు అరెస్టుపై చర్చించాలని డిమాండ్ చేస్తూ.. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దాంతో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా అదే పరిస్థితులు రిపీట్ అయ్యాయి.
AP Assembly Day 2 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా రసాభాసగా మారింది. చంద్రబాబు అరెస్టుపై చర్చించాలని డిమాండ్ చేస్తూ.. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దాంతో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా అదే పరిస్థితులు రిపీట్ అయ్యాయి. ఈ క్రమంలో టీడీపీ నేత, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సభలో ఈల వేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఇక నిన్న సభలో కూడా బాలకృష్ణ మీసం తిప్పిన వ్యవహారం ఎంతటి చర్చనీయాంశగా మారిందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో రెండో రోజు కూడా బాలకృష్ణ సభలో విజిల్ వేయడం మళ్ళీ గందరగోళానికి తెర లేపింది. అయితే బాలకృష్ణ విజిల్ వేయడం పట్ల మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మళ్ళీ సీన్ అంబటి వర్సెస్ బాలకృష్ణగా మారింది.
తన తండ్రిని చంపిన బావ కళ్లలో ఆనందం చూసేందుకు బాలకృష్ణ ప్రయత్నిస్తున్నారని అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. చంద్రబాబు సీట్లో కూర్చోవాలని చెప్పినా కూర్చోవడం లేదన్నారు. అవకాశం వచ్చినా కూడ ఎందుకు ఆ సీట్లో కూర్చోవడం లేదన్నారు. చంద్రబాబు సీటుపై కాదు… చంద్రబాబుపై ఎక్కి కూర్చోవాలని అంబటి రాంబాబు కోరారు. టీడీపీ సభ్యులు ఇలానే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి సింగిల్ డిజిట్ మాత్రమే దక్కుతుందని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.