Haldiram: హల్దీరామ్ లో 51% వాటా కొనుగోలుకు టాటా గ్రూప్ చర్చలు
టాటా గ్రూప్ ప్రముఖ స్నాక్ ఫుడ్ మేకర్ హల్దీరామ్ లో 51% వాటా కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది. అయితే వారు కోరిన $10 బిలియన్ల వాల్యుయేషన్ చాలా ఎక్కువగా భావిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ ఈ ఒప్పందం విజయవంతంగా ముగిస్తే టాటా గ్రూప్ నేరుగా పెప్సీ మరియు బిలియనీర్ ముఖేష్ అంబానీ యొక్క రిలయన్స్ రిటైల్‌తో పోటీపడుతుంది.
Haldiram: టాటా గ్రూప్ ప్రముఖ స్నాక్ ఫుడ్ మేకర్ హల్దీరామ్ లో 51% వాటా కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది. అయితే వారు కోరిన $10 బిలియన్ల వాల్యుయేషన్ చాలా ఎక్కువగా భావిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ ఈ ఒప్పందం విజయవంతంగా ముగిస్తే టాటా గ్రూప్ నేరుగా పెప్సీ మరియు బిలియనీర్ ముఖేష్ అంబానీ యొక్క రిలయన్స్ రిటైల్‌తో పోటీపడుతుంది.
స్నాక్ మార్కెట్లో 13 శాతం వాటా..(Haldiram)
భారతదేశంలో ప్రతీ ఇంటికి పరచితమైన బ్రాండ్ హల్దీరామ్. ఇపుడు 10% వాటా విక్రయం గురించి బైన్ క్యాపిటల్‌తో సహా ప్రైవేట్ ఈక్విటీ సంస్థలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. టాటా 51% కంటే ఎక్కువ కొనుగోలు చేయాలనుకుంటున్నారని, అయితే హల్దీరామ్ చెప్పిన రేటు పైనే ఆలోచిస్తున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టాటా (కన్స్యూమర్) ఒక టీ కంపెనీగా పరిగణించబడుతుంది. హల్దీరామ్ విస్తృత మార్కెట్ వాటాను కలిగి ఉందని అందువలన తమ బ్రాండ్ కు తగినట్లుగా అడుగుతోందన్న వాదనలు కూడా ఉన్నాయి.హల్దీరామ్ 1937లో స్థాపించబడిన ఒక చిన్న దుకాణం నుండి ప్రారంభమై నేడు భారత్ స్నాక్ మార్కెట్లో 13 శాతం వాటాను కలిగి ఉంది. మరోవైపు లేస్ చిప్స్ విక్రయాలు సాగించే పెప్పీకూడా అదే శాతం వాటాను కలిగి ఉంది. హల్దీరామ్ స్నాక్స్ సింగపూర్ మరియు యునైటెడ్ స్టేట్స్ వంటి విదేశీ మార్కెట్లలో కూడా అమ్ముడవుతాయి. ఈ కంపెనీకి స్థానిక ఆహారం, స్వీట్లు మరియు పాశ్చాత్య వంటకాలను విక్రయించే దాదాపు 150 రెస్టారెంట్లు ఉన్నాయి.