Last Updated:

Palestinian restaurant: ఆ రెస్టారెంట్లో మహిళలకు మాత్రమే ప్రవేశం..

కఠినమైన కట్టుబాట్లు ఉన్నచోట హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం గొంతు వినిపిస్తూనే ఉంటారు కొందరు. ముఖ్యంగా ఆడవాళ్లను కట్టడి చేసే పాలస్తీనా లాంటి దేశంలో మార్పు కోసం చేసే చిన్న ప్రయత్నం అయినా చాలా పెద్దదే అవుతోంది.

Palestinian restaurant: ఆ రెస్టారెంట్లో మహిళలకు మాత్రమే ప్రవేశం..

Gaza: కఠినమైన కట్టుబాట్లు ఉన్నచోట హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం గొంతు వినిపిస్తూనే ఉంటారు కొందరు. ముఖ్యంగా ఆడవాళ్లను కట్టడి చేసే పాలస్తీనా లాంటి దేశంలో మార్పు కోసం చేసే చిన్న ప్రయత్నం అయినా చాలా పెద్దదే అవుతోంది. గాజాలోని ఈ రెస్టారెంట్ కూడా అలాంటిదే. ‘సబాయియ విఐపి’ పేరుతో గత నెలలో మొదలుపెట్టారు. ఈ రెస్టారెంట్​లోకి కేవలం ఆడవాళ్లను మాత్రమే అనుమతిస్తారు.

పాలస్తీనాలో ఆడవాళ్ల విషయంలో రూల్స్​ ఎక్కువ. చదువు, ఉద్యోగం, కెరీర్ అనేవి వాళ్లలో చాలా మందికి కలగానే మిగిలిపోతుంటాయి. తన జీవితం కూడా అలా కావద్దు అనుకుంది అమీన అల్ హయెక్. చెఫ్​గా ట్రైనింగ్ తీసుకుంది. రెస్టారెంట్​లో జాబ్ చేస్తూ, నచ్చినట్టు బతకాలనుకుంది. కానీ, ఆమెకు ఎక్కడా అవకాశం దొరకలేదు. కారణం, అక్కడి హోటళ్లు, రెస్టారెంట్లలో చెఫ్​గా మగవాళ్లని మాత్రమే తీసుకునేవాళ్లు.​ అప్పుడే ఆమెకు ఆడవాళ్ల కోసం ప్రత్యేకంగా పెట్టిన ‘సబాయియ విఐపి’ రెస్టారెంట్ గురించి తెలిసింది. ​దీన్ని రీహం హమౌదా అనే ఆవిడ నడుపుతోంది.

‘సబాయియ’ అంటే అరబిక్​ భాషలో ‘ఆడవాళ్లంతా ఒకచోట సరదాగా మాట్లాడుకునే స్థలం​’ అని అర్థం. ఇందులో వండే వాళ్ల నుంచి సర్వ్ చేసేవాళ్ల వరకు అంతా ఆడవాళ్లే ఉంటారు. ఇక్కడ చికెన్ శాండ్​విచ్​, పిజ్జా తింటూ నచ్చినంత సేపు కబుర్లు చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇందులో ఎనిమిది మంది పనిచేస్తున్నారు. ‘‘మేం కూడా రెస్టారెంట్​ నడపగలం. మగవాళ్ల సలహాలు, సాయం అవసరం లేకుండా సక్సెస్​ కాగలం. అన్ని పనులు చేయగలమని ప్రపంచానికి చాటడమే తన ఉద్దేశమంటున్నారు అమీనా.

ఇవి కూడా చదవండి: