Telangana Liberation Day: వేడుక ఒక్కటే.. పార్టీల్లో మాత్రం వేర్వేరుగా
వేడుక ఒక్కటే. పార్టీల్లో మాత్రం వేర్వేరుగా. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన 8ఏళ్ల అనంతరం ఆ వేడుకకు ఈ ప్రత్యేకత చోటుచేసుకొనింది. అదేంటో తెలుసుకోవాలంటే తెలుగు ప్రజలు తెలంగాణ వైపు ఓ లుక్ వెయ్యాల్సిందే.
Hyderabad: సెప్టెంబర్ 17 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రంగా బీజం పడిన ముఖ్య దినం. రాష్ట్రం ఏర్పడిన అనంతరం టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినాన్ని చేపట్టలేదు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ విలీన దినం వజ్రోత్సవాల పేరుతో ప్రభుత్వం అధికారికంగా ఈ ఏడాది చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినంను అధికారికంగా ప్రకటించాలని తొలి నుండి పట్టుబడుతున్న ప్రతిపక్షలు సైతం విమోచన దినోత్సవాన్ని విభన్నంగా చేపడుతూ వారి వారి ప్రాభల్యాన్ని ప్రజల్లో పెంచుకొనేందుకు సిద్ధమైనారు.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో చేపడుతున్న ప్రచారానికి అధికార పార్టీ టీఆర్ఎస్ వారికి అడ్డంకులు సృష్టించేలా మెట్రో పిల్లర్లు, ఆర్టీసి వ్యవస్ధలను కేవలం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకే ఉండేలా ముందస్తు ఒప్పందం చేసుకొని రాజకీయ చతురత చూపించింది. దీంతో భాజాపా కూడా తామేమి తక్కువ కాదన్నట్లుగా కేంద్ర హోంశాఖామాత్యులు అమిత్ షా ను హైదరాబాదుకు తీసుకొచ్చి ప్రత్యేక సభ ద్వారా తమ సత్తా ఏంటో చూపించేందుకు రెడీ అయింది.
మరోవైపు తెలంగాణ ఆవిర్భావానికి నాటి మూల స్ధంభాల్లో ఒకటైన కాంగ్రెస్ పార్టీ తగ్గేదేలా అంటూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని చేపట్టేందుకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొంటున్నారు. హైదరాబాద్ స్వాతంత్య్ర దినం పేరిట వేడుకలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లోనే తెలంగాణ గీతంతో పాటు రాష్ట్ర పతాకాన్ని ఆవిష్కరిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని భాజాపా నిర్వహిస్తుండగా, అధికార టిఆర్ఎస్ తెలంగాణ విలీన దినం పేరిట ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుండగా, తాజాగా హైదరాబాద్ స్వాతంత్య్ర దినోత్సవమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతను తమ ఖాతాలో వేసుకొనేందుకు తెలంగాణ రాజకీయ పార్టీలు వేసుకొంటున్న ఎత్తుకు పైఎత్తులను ఓటర్లు నిశతంగా గమనిస్తున్నారు.