Road Accident : హైదరాబాద్ రోడ్ల దుస్థితి కారణంగా.. చిన్నారి మృతి.. ఎక్కడంటే ?
హైదరాబాద్ బాచుపల్లిలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం అందరితో కంటతడి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు.. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ఆ వాహనంపై ఉన్న చిన్నారి కింద పడిపోగా.. ఆమెపై నుంచి బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఇందుకు
Road Accident : హైదరాబాద్ బాచుపల్లిలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం అందరితో కంటతడి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు.. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ఆ వాహనంపై ఉన్న చిన్నారి కింద పడిపోగా.. ఆమెపై నుంచి బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఇందుకు ఓ వర్గం రోడ్డుపై ఉన్న గుంతలె కారణం అని చెబుతుండగా.. పోలీసులు మాత్రం బస్సు అతివేగమే కారణం అని అంటున్నారు. అది ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా ఉన్న గుంట అయిన కానీ.. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అయినా కానీ మొత్తానికి ఓ చిన్నారి 8 ఏళ్ల వయస్సులోనే తుదిశ్వాస విడిచింది. ప్రస్తుతం ఈ ఘటన నగరంలో సంచలనంగా మారింది.
ఈ విషాద ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం గ్రామానికి చెందిన కిషోర్, పద్మ దంపతుల మొదటి కుమార్తె దీక్షిత. వీరు హైదరాబాద్ లో నివసిస్తున్నారు. హైదరాబాద్ బాచుపల్లి పరిధిలోని బౌరంపేట్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 8 ఏళ్ల చిన్నారి దీక్షిత రెండో తరగతి అభ్యసిస్తుంది. ఈ నేపథ్యంలో బుధవారం చిన్నారిని తండ్రి కిషోర్ స్కూటీపై స్కూల్ కు తీసుకెళ్లున్నాడు. ఈ క్రమంలో బాచుపల్లి పరిధిలో రెడ్డీస్ ల్యాబ్ వద్ద ఉన్న గుంతల కారణంగా వారు కిందపడిపోగా.. ఆ సమయంలోనే వెనుక నుంచి వస్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి చెందింది.
ఈ ఘటనలో తండ్రికి గాయాలు కాగా.. సమాచారం తెలుసుకున్న బాచుపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. చికిత్స కోసం చిన్నారి తండ్రి కిషోర్ ను ఆస్పత్రికి తరలించారు. చిన్నారి దీక్షిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా జరిగిన ఘటన గురించి విచారిస్తున్నారు.