CM YS JAGAN : విశాఖ పర్యటనలో రూ.864.88 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన..
ఇనార్బిట్ మాల్ నిర్మాణంతో 8 వేల మందికి ఉపాధి లభ్యం కానుందని సీఎం జగన్ చెప్పారు. నేడు విశాఖలో పర్యటించిన జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా నగరంలోని కైలాసపురంలో ఇనార్బిట్ మాల్ కు సీఎం జగన్ భూమి పూజ చేశారు. రూ. 600 కోట్లతో ఈ మాల్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 15 ఎకరాల్లో ఈ నిర్మాణాన్ని చేపట్టనుంది రహేజా సంస్థ మరో వైపు
CM YS JAGAN : ఇనార్బిట్ మాల్ నిర్మాణంతో 8 వేల మందికి ఉపాధి లభ్యం కానుందని సీఎం జగన్ చెప్పారు. నేడు విశాఖలో పర్యటించిన జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా నగరంలోని కైలాసపురంలో ఇనార్బిట్ మాల్ కు సీఎం జగన్ భూమి పూజ చేశారు. రూ. 600 కోట్లతో ఈ మాల్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 15 ఎకరాల్లో ఈ నిర్మాణాన్ని చేపట్టనుంది రహేజా సంస్థ మరో వైపు రూ. 136 కోట్లతో జీవీఎంసీలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడ సీఎం ప్రారంభించనున్నారు. విశాఖ పర్యటన సందర్భంగా మొత్తం రూ.864.88 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఏపీ సీఎం జగన్ ప్రసంగించారు.
విశాఖపట్టణంలో ఆణిముత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టుల్లో ఇది ఒకటన్నారు. విశాఖ అభివృద్ధికి ఈ మాల్ దోహదపడుతుందన్నారు. ఈ మాల్ నిర్మాణంతో విశాఖ రూపురేఖలు మారిపోతాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. అలానే రెండున్నర ఎకరాలను ఐటీ కోసం కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఫైవ్ స్టార్ హోటల్ కూడ నిర్మించేందుకు రహేజా గ్రూప్ ఆసక్తిగా ఉందని సీఎం జగన్ చెప్పారు. రహేజా గ్రూప్‌నకు ప్రభుత్వం అన్ని రకాలుగా సపోర్టును ఇవ్వనున్నట్టుగా సీఎం హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాల కోసం ఎప్పుడైనా తనను నేరుగా సంప్రదించవచ్చని సీఎం జగన్ చెప్పారు. ఏ విషయమైనా తనకు ఒక్క ఫోన్ చేస్తే సరిపోతుందన్నారు.
విశాఖలో రూ.600 కోట్లతో నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్‌కు రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజాతో కలిసి సీఎం వైయస్ జగన్ భూమి పూజ చేశారు. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నఈ ఇనార్బిట్ మాల్ 2026 నాటికి అందుబాటులోకి రానుంది. ఈ మాల్ ద్వారా 8వేల మందికి ఉపాధి లభించనుంది.… pic.twitter.com/Rdl5DbsryV
— YSR Congress Party (@YSRCParty) August 1, 2023
అదే విధంగా ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌లో పలు నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఏయూ క్యాంపస్‌లో సుమారు రూ.21 కోట్లతో స్టార్టప్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ హబ్ (ఏ హబ్)ను అభివృద్ధి చేశారు. రూ.44 కోట్లతో ఫార్మా కంపెనీల కోసం 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఫార్మా ఇంక్యుబేషన్, బయోలాజికల్ మానిటరింగ్ హబ్‌ను సీఎం స్టార్ట్ చేశారు. డిజిటల్ క్లాసులు, డిజిటల్ పరీక్షల కోసం రూ.35 కోట్లతో అల్గోరిథమ్ పేరుతో ఏయూ డిజిటల్ జోన్ అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ కాంప్లెక్స్‌ను నూతనంగా నిర్మించారు. అంతర్జాతీయ అనలిటిక్స్‌లో మాస్టర్ పోగ్రాములు నిర్వహించేలా ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ సెంటర్‌ను రూ.18 కోట్లతో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. మెరైన్ ఫార్మింగ్, ప్రాసెసింగ్ ప్యాకేజింగ్‌లో నైపుణ్య శిక్షణ కోసం అవంతి ఫుడ్స్‌తో కలిపి రూ.11 కోట్లతో ఏయూ అవంతి ఆక్వా కల్చర్ స్కిల్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ హబ్‌ను నెలకొల్పారు.