PM Modi Announces: నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు ప్రైజ్ మనీ .. ప్రధాని మోదీ ప్రకటన
తనకు ప్రదానం చేసిన లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు పురస్కారం మొత్తాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మంగళవారం పూణేలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. నేను బహుమతి డబ్బును నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ అవార్డును దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు అంకితం చేయాలనుకుంటున్నానని మోదీ అన్నారు.
PM Modi Announces: తనకు ప్రదానం చేసిన లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు పురస్కారం మొత్తాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మంగళవారం పూణేలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. నేను బహుమతి డబ్బును నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ అవార్డును దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు అంకితం చేయాలనుకుంటున్నానని మోదీ అన్నారు. దీనిని చిరస్మరణీయ క్షణం గా పేర్కొన్నారు.
ఈ సందర్బంగా ప్రధాని మదోీ లోకమాన్య తిలక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.నేను స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య తిలక్ మరియు సామాజిక సంస్కర్త అన్నా భౌ సాథే ఇద్దరికీ నా నివాళులర్పిస్తున్నాను. భారతదేశ స్వాతంత్య్రంలో లోకమాన్య తిలక్ పాత్ర, ఆయన చేసిన కృషిని కొన్ని సంఘటనలు మరియు మాటలలో క్లుప్తీకరించలేము” అని ఆయన అన్నారు.వ్యవస్థా నిమాన్ సే సంస్థ నిర్మాణ్’, ‘సంస్థ నిర్మాణ్ సే వ్యక్తి నిర్మాణ్’, ‘వ్యక్తి నిర్మాణ్ సే రాష్ట్ర నిర్మాణ్’ దార్శనికత దేశ నిర్మాణానికి రోడ్‌మ్యాప్‌లా పనిచేస్తుంది. భారతదేశం ఈ రోజు ఈ రోడ్‌మ్యాప్‌ను శ్రద్ధగా అనుసరిస్తోందని మోదీ అన్నారు.
లోకమాన్య తిలక్ వర్ధంతి అయిన ఆగస్టు 1న ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందజేస్తారు. ఈ అవార్డును అందుకున్న 41వ వ్యక్తి ప్రధాని మోదీ. దీనిని గతంలో డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, ప్రణబ్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్, ఎన్ ఆర్ నారాయణ మూర్తి, ఇ శ్రీధరన్ వంటి ప్రముఖులకు అందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ని ఆహ్వానించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి అజిత్ పవార్ కూడా హాజరయ్యారు.
మోదీ తో పాటు వేదికపైన శరద్ పవార్ ..( PM Modi Announces)
ప్రధాని నరేంద్ర మోదీకి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును ప్రదానం చేసిన సందర్బంగా ఆయనతో పాటు వేదికపై ఉన్న ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ కూడా ఉన్నారు. ప్రధాని మోదీతో వేదిక పంచుకోవద్దన్న ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యుల అభ్యర్థనలను పవార్ పట్టించుకోనట్లు కనిపించింది. బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఇది విపక్షాలకు మంచి ఆప్టిక్స్ కాదని I.N.D.I.A కూటమి సభ్యులు భావించారు.
మెట్రో రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ ..
పూణే మెట్రో ఫేజ్ Iలోని రెండు కారిడార్లలో పూర్తయిన సెక్షన్లలో సేవల ప్రారంభోత్సవం సందర్భంగా మెట్రో రైళ్లను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.ఈ ప్రాజెక్టుకు 2016లో ప్రధాని మోదీ శంకుస్థాపన కూడా చేశారు.కొత్త సెక్షన్లు పూణే నగరంలోని శివాజీ నగర్, సివిల్ కోర్ట్, పూణే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, పూణే RTO మరియు పూణే రైల్వే స్టేషన్ వంటి ముఖ్యమైన ప్రదేశాలను కలుపుతాయి.తన పర్యటనలో, పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పిసిఎంసి) ఆధ్వర్యంలో సుమారు రూ. 300 కోట్లతో అభివృద్ధి చేసిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.