Heavy Rains: ఉత్తరాదిని వణికిస్తోన్న వర్షాలు.. 100 మందికిపైగా మృతి.. రానున్న ఐదురోజులు అలర్ట్ అంటున్న ఐఎండీ
Heavy Rains: ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు వణికిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ సహా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్, ఇంకా దేశంలోని పలు ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి.
Heavy Rains: ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు వణికిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ సహా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్, ఇంకా దేశంలోని పలు ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. ఇక శుక్రవారం రాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షాలకు మహారాష్ట్రలోని ముంబయి, థానే, పాల్ఘార్, రాయ్ గడ్తోపాటు పలు జిల్లాల్లో శనివారం నుంచి మరో ఐదు రోజులపాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐఎండీ అధికారులు పలు ప్రాంతాలకు ఎల్లోఅలర్ట్ జారీ చేశారు. రాయగఢ, రత్నగిరి జిల్లాల్లో శనివారం భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
100 మందిపైగా మృతి(Heavy Rains)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 18వతేదీ వరకు కూడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ నీటమునిగింది. రాష్ట్రంలో కురుస్తోన్న భారీవర్షాలు, వరదల ప్రజల జీవనం అస్తవ్యస్తం అయ్యింది. వరదల వల్ల 100 మందిపైగా మరణించారు. ఇది ఉంటే మరోపక్క ఢిల్లీలోని వాననీరు చుట్టిముట్టింది. శుక్రవారం హర్యానా డ్యాం నుంచి నీటి విడుదలను తగ్గించడంతో ఢిల్లీలో వరదలు తగ్గుముఖం పట్టాయనే చెప్పవచ్చు. యమునా నదిలో నీటి మట్టం శుక్రవారం రాత్రి నుంచి తగ్గుతూ వస్తుంది. ఢిల్లీలోని ఎర్రకోట అసెంబ్లీ ప్రాంతాల వరకు వాననీరు చేరింది. శాంతివన్ ప్రాంతంలోనూ వరదనీరు ముంచెత్తింది.
ఓల్డ్ రైల్వే వంతెన వద్ద యమునా నది నీటిమట్టం శుక్రవారం రాత్రి 11 గంటలకు 207.98 మీటర్లకు తగ్గింది. వరదల వల్ల హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలోని కాసోల్ వద్ద కొట్టుకుపోయిన రోడ్డును అధికారులు నేడు పునరుద్ధరించనున్నారు. కాసోల్, బంజర్, తీర్థన్ ప్రాంతాల్లో మొబైల్ నెట్ వర్క్ ను పునరుద్ధరించామని అధికారులు ట్వీట్ చేశారు. ముంబయి నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోనూ భారీవర్షాలు కురుస్తున్నందు వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.