Varahi Yatra Second Schedule: జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర రెండో విడత షెడ్యూల్ ఇదే
Varahi Yatra Second Schedule: జనసేనాని పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహి విజయ యాత్ర రెండో విడత షెడ్యూల్ ఖరారైంది. మొదటి విడత వారాహి యాత్రలో భాగంగా అన్నవరం నుంచి భీమవరం వరకు వారాహి విజయ యాత్రను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
Varahi Yatra Second Schedule: జనసేనాని పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహి విజయ యాత్ర రెండో విడత షెడ్యూల్ ఖరారైంది. మొదటి విడత వారాహి యాత్రలో భాగంగా అన్నవరం నుంచి భీమవరం వరకు వారాహి విజయ యాత్రను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా వారాహి రెండో విడద షెడ్యూల్ ను విడుదల చేశారు. ఏలూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో పర్యటించేందుకు జనసేనాని సిద్ధమయ్యారు. ఈ విషయమై శనివారం నాడు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. తొలి విడత వారాహి యాత్ర సక్సెస్ కావడంతో రెండో విడతపై చర్చించారు.
రేపు ఏలూరు నుంచి రెండో విడత వారాహి యాత్రను ప్రారంభించనున్న సందర్భంగా ఏలూరు సభ ఏర్పాట్లు, యాత్ర వివరాలపై పార్టీ నేతలతో పవన్ చర్చించారు. ఇదిలా ఉంటే తమ నాయకుడి పర్యటనతో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహం నింపింది. మొదటి విడత విజయోత్సాహంతో రెండో విడత వారాహి యాత్రను కూడా మరింత విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడత యాత్రలో వైసీపీ ప్రభుత్వం, అధికార పార్టీ అన్యాయాలను ఆ పార్టీ నాయకుల దౌర్జన్యాలపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక అదే పంథాలో రెండో విడతలో యాత్ర కొనసాగించనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఏలూరు నగరం జనసేన జెండాలు ఫ్లెక్సీలతో నిండిపోయింది. మార్పు మొదలయ్యిందంటూ పవన్ కట్ ఔట్లు వెలిశాయి.
వారాహి విజయ యాత్ర రెండో షెడ్యూల్( 4 రోజులు) వివరాలు ఇలా(Varahi Yatra Second Schedule)
09-07-2023 : మధ్యాహ్నం ఏలూరు మిని బైపాస్ లోని క్రాంతి కల్యాణ మండపానికి జనసేనాని చేరుకొంటారు. సాయంత్రం 5 గంటలకు ఏలూరులో బహిరంగ సభలో పాల్గొంటారు.
10-07-2023 : మధ్యాహ్నం 12 గంటలకు ఏలూరు మినీ బైపాస్ లోని క్రాంతి కళ్యాణ మండపంలో జనవాణి నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతారు.
11-07-2023 : క్రాంతి కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 12 గంటలకు దెందులూరు నియోజకవర్గ ముఖ్య నాయకులు, వీర మహిళలతో పవన్ సమావేశవుతారు. సాయంత్రం 5 గంటలకు రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లిగూడెం చేరుకుంటారు.
12-07-2023 : బుధవారం సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెంలో బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు.