Minister Harish Rao: సంపదను మిత్రులకు కాదు, పేదలకు ఇచ్చాం
కేంద్రం మాదిరిగా సంపదను మిత్రులకు కాదు పేదలకు పంచిపెడుతున్నామని గుర్తించుకోవాలని తెలంగాణ మంత్రి హరీష్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అసెంబ్లీలో ప్రసంగించారు.
Hyderabad: రాష్ట్రాల వాటా 42 శాతానికి పెంచామని చెబుతున్న కేంద్రం మాటలకు తెలంగాణాకు వస్తున్న 29.6 వాటా శాతంతో ఎక్కడా పొంతన కుదరడంలేదని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రెండవరోజు అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విధానం పై ధ్వజమెత్తారు.
కేంద్రం మాదిరిగా సంపదను మిత్రులకు కాదు పేదలకు పంచిపెడుతున్నామని గుర్తించుకోవాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఆపివేసిందని ఆయన మండిపడ్డారు. ఎఫ్ ఆర్ భీఎం రుణ పరిమితి పేరుతో రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నారని కేంద్రాన్ని దుయ్యబట్టారు. రాష్ట్రాలను సంప్రదించకుండా కోతలు ఎలా పెడతారని నిలదీసారు. న్యాయబద్దంగా రావాల్సిన నిధుల కంటే రూ. 33712 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందన్నారు. కేంద్రం వల్ల దేశంలో ఎవరు బాగుపడ్డారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన రూ.1350 కోట్లు పెండింగ్ లో పెట్టారంటూ మంత్రి విమర్శించారు.
అయితే ఇక్కడ మంత్రి అసెంబ్లీలో ఓ విషయాన్ని మరిచారు. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ది చెందిందని పదే పదే చెబుతున్న మాటలకు వెనుకబడిన జిల్లాల మాటలకు పొంతన కుదరడం లేదు.