BAN vs AFG Test Match: టెస్ట్ క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ పెను సంచలనం.. 21వ శతాబ్ధంలో అతిపెద్ద విజయం
BAN vs AFG Test Match: టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 21వ శతాబ్ధిలో అత్యధిక విజయం సాధించింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భారీ విజయం నమోదు చేసింది.
BAN vs AFG Test Match: టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 21వ శతాబ్ధిలో అత్యధిక విజయం సాధించింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భారీ విజయం నమోదు చేసింది. ఏకంగా 546 పరుగుల తేడాతో అఫ్షాన్ జట్టును చిత్తుచిత్తుగా ఓడించింది. దానితో పరుగుల పరంగా అత్యంత భారీ తేడాతో గెలుపు సాధించిన మూడో జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఇంగ్లాండ్ జట్టు ఉండగా.. రెండో స్థానంలో ఆస్ట్రేలియా జట్టు ఉంది.
1928లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మ్యాచ్ లో కంగారుల జట్టుపై ఇంగ్లండ్ 657 పరుగుల తేడాతో గెలిచింది. ఆ తర్వాత 1934లో అదే ఇంగ్లండ్ ఆస్ట్రేలియాల మధ్య జిరగిన మ్యాచ్లో ఈ సారి ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండుపై 562 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఆ తర్వాత అంతటి భారీ స్కోర్ తేడాతో తాజాగా బంగ్లాదేశ్ జట్టు గెలవడం విశేషం. దానితో అత్యంత భారీ స్కోర్ తేడాతో గెలిచిన జట్ల జాబితాలో మూడో స్థానంలో బంగ్లా నిలిచింది.
అఫ్ఘాన్ ను చిత్తుచేసిన బంగ్లా(BAN vs AFG Test Match)
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసింది. నజ్ముల్ హోస్సెన్ షాంటో 175 బంతుల్లో 23 ఫోర్లు, 2 సిక్స్‌లతో 146 పరుగులు చేశాడు. మహ్మదుల్ హసన్ జాయ్(76), మెహిదీ హసన్ మిరాజ్ (48)లు మైదానంలో పరుగుల వరద పారిచారు. దానితో మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 382 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన అప్గానిస్థాన్ 146 పరుగులకే కుప్పకూలింది. దీంతో బంగ్లాకు 236 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
ఇక ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ 425/4 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. నజ్ముల్ హోస్సెన్ షాంటో భారీ శతకాలతో విజృంభించాడు. 151 బంతుల్లో 15 ఫోర్లతో 124 పరుగులు చేయగా, మోమినుల్ హక్ 145 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 121 నాటౌట్గా నిలిచాడు. దీనితో అఫ్గాన్ జట్టు ముందు 662 పరుగుల భారీ లక్ష్యం ఉంది. లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గాన్ జట్టు 115 పరుగులకే ఆలౌవ్వడంతో బంగ్లా జట్టు విజయం ఖాయమయ్యింది. టస్కిన్ అహ్మద్ నాలుగు, షోరిఫుల్ ఇస్లామ్ మూడు వికెట్లు తీసి అఫ్గాన్ పతనాన్ని శాసించారు. దీనితో బంగ్లాదేశ్ జట్టు 546 పరుగుల భారీ తేడాతో విజయకేతనం ఎగురవేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో చెలరేగిన నజ్ముల్ హోస్సెన్ షాంటో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.