యాషెస్ టెస్టు సిరీస్‌కు ఆ పేరు ఎలా వచ్చింది
యాషెస్ టెస్టు సిరీస్‌కు ఆ పేరు ఎలా వచ్చింది What is The story behind Ashes Test Series

యాషెష్ కప్ అంటే ఏంటి దాని కథేంటి

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఈ టెస్టు సిరీస్‌కు యాషెస్ అనే పేరు రావడం వెనుక చాలా కథ ఉంది.

1882లో లండన్‌లోని ఓవల్‌లో ఆస్ట్రేలియా చేతితో ఇంగ్లాండ్ ఓడింది.

సొంతగడ్డపై ఇంగ్లాండ్‌కు అదే తొలి ఓటమి. దీంతో అప్పటి ‘స్పోర్టింగ్ టైమ్స్’లో విలేకరి రెజినాల్డ్ షిర్లీ.. ‘‘ఆగస్టు 29, 1882 నాడు ఓవల్‌లో ఇంగ్లిష్ క్రికెట్ మరణించింది.

ఆ శరీరాన్ని కాల్చి బూడిద (యాషెస్)ను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లారు’’ అని షిర్లీ రాసుకొచ్చారు.

కొన్ని వారాల తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటించిన ఇంగ్లాండ్.. క్రిస్ట్‌మస్ సందర్భంగా మ్యాచ్ ఆడింది. ఈ సందర్భంగా మట్టితో చేసిన చిన్న కప్పును ప్రదర్శించిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఐవో బ్లై.. ఇదే యాషెస్‌కు చిహ్నమని, దీన్ని తిరిగి గెలుస్తామని ప్రమాణం చేసినట్లు చెప్పాడు.

అప్పటి నుంచి ఈ రెండు జట్ల మధ్య టెస్టు సిరీస్‌కు యాషెస్ అనే పేరు వచ్చింది

ఆ నాలుగు అంగుళాల పొడవుండే నిజమైన యాషెస్ కప్పు లార్డ్స్‌లోని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ మ్యూజియంలో ఉంది.

ఇప్పుడు విజేతలకు దాని నమూనా కప్పును మాత్రమే అందజేస్తున్నారు.

ఆ కప్పులో ఐవో భార్య ధరించిన పరదాను కాల్చిన బూడిద ఉందని అంటుంటే ఇంకొందరేమో దానిలో క్రికెట్ స్టంప్ బూడిద ఉందని అంటారు.
