Last Updated:

JioCinema: జియోసినిమాలో భారత్- వెస్టిండీస్ లైవ్ స్ట్రీమింగ్

ఐపీఎల్‌ 2023 సీజన్ ప్రసార హక్కులను దక్కించుకున్న జియో సినిమా.. తాజాగా భారత్ - వెస్టిండీస్ మధ్య జరుగనున్న మ్యాచుల ప్రసారం హక్కులను దక్కించుకుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన వయాకామ్ 18 వెల్లడించింది.

JioCinema: జియోసినిమాలో భారత్- వెస్టిండీస్ లైవ్ స్ట్రీమింగ్

JioCinema: ఐపీఎల్‌ 2023 సీజన్ ప్రసార హక్కులను దక్కించుకున్న జియో సినిమా.. తాజాగా భారత్ – వెస్టిండీస్ మధ్య జరుగనున్న మ్యాచుల ప్రసారం హక్కులను దక్కించుకుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన వయాకామ్ 18 వెల్లడించింది. భారత్ -వెస్టిండీస్ మధ్య రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచులు జరుగునున్నాయి. నెల రోజుల పాటు జరిగే ఈ మ్యాచులను జియోసినిమా ప్రసారం చేయనుంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, భోజ్ పురి, పంజాబీ, తమిళం, కన్నడ భాషల్లో కామెంటరీ ఉంటుంది.

 

బెంచ్ మార్క్ క్రియేట్ చేశాం(JioCinema)

తనదైన స్ట్రీమింగ్ అనుభవాన్ని అందించడం ద్వారా జియో సినిమా ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసిందని వయాకామ్ 18 స్పోర్ట్స్ హెడ్ తెలిపారు. వెస్టిండీస్ టూర్ ద్వారా ప్రపంచ స్థాయి స్ట్రీమింగ్ అనుభవాన్ని వీక్షకులకు అందిస్తామన్నారు. ఈ ప్రసారాలను కూడా ఉచితంగానే జియో సినిమా అందించనున్నట్టు సమాచారం. కాగా, ఐపీఎల్ ను ఉచితంగా ప్రసారం చేసి రికార్డు వ్యూవర్ షిప్ ను జియో నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.

 

జులై 12 నుంచి వెస్టిండీస్ టూర్(JioCinema)

భారత్ జులై 12 నుంచి ఆగష్టు 13 వరకు వెస్డిండీస్‌ టూర్‌ కు వెళ్లనుంది. ఈ టూర్ లో భాగంగా వివిధ ఫార్మాట్లలో కరేబియన్‌ జట్టుతో టీమ్‌ ఇండియా ఢీ కొట్టనుంది. జులై 12-16 మధ్య తొలిటెస్టు, 20-24 మధ్య రెండో టెస్టు జరుగుతుంది. జులై 27, 29, ఆగస్టు 1వ తేదీల్లో రెండు జట్ల మధ్య మూడు వన్డేలు జరుగుతాయి. ఆగస్టు 3, 6, 8, 12, 13 తేదీల్లో 5 టీ20 మ్యాచుల్లో ఇరు జట్లు తలపడతాయి. ఈ టూర్ కోసం టీంఇండియా తన జట్టును ఇంకా ప్రకటించలేదు.