Last Updated:

Digestion In Summer: సమ్మర్ లో జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా?

వేసవి కాలంలో చాలా మందికి జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. దీనికి కారణం సరైన ఆహారం తీసుకోక పోవటం, నీళ్లు తాగకపోవటం, వేడిలో ఎక్కువ సేపు ఉండటం వల్ల ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. అయితే ఈ సమస్యల నుంచి పరిష్కారం పొందాలంటే

Digestion In Summer: సమ్మర్ లో జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా?

Digestion In Summer: వేసవి కాలంలో చాలా మందికి జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. దీనికి కారణం సరైన ఆహారం తీసుకోక పోవటం, నీళ్లు తాగకపోవటం, వేడిలో ఎక్కువ సేపు ఉండటం వల్ల ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. అయితే ఈ సమస్యల నుంచి పరిష్కారం పొందాలంటే పౌష్టికాహార నిపుణులు సూచించిన వాటిని ఫాలో అయితే ఉపశమనం లభిస్తుంది.

 

అల్సర్స్‌ను తగ్గించటంతో పాటు

ఓట్స్‌ వల్ల అనేక రకాల ప్రయోజనాలున్నాయని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటున్నారు. ఓట్స్‌లో కేలరీలు తక్కువ ఉండటంతో పాటుగా మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా పెరగటానికి ఉపకరిస్తుంది.

వేసవిలో ప్రతి రోజూ బార్లీ నీళ్లు తాగటం, రాగి సంకటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. బార్లీ, రాగి మన కడుపులో ఏర్పడే అల్సర్స్‌ను తగ్గించటంతో పాటు గ్యాస్‌ను కూడా నివారిస్తాయి.

Oat Porridge - Ahead of Thyme

మంచి బ్యాక్టీరియా చని పోకుండా(Digestion In Summer)

ఉదయాన్నే కొన్ని పెసర మొలకలు తినటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందనేది నిపుణుల మాట. పెసర మొలకల్లో ఫైబర్‌, ఎంజైమ్స్‌, విటమిన్స్‌, మినరల్స్‌ అధికంగా ఉంటాయి. పెసర మొలకలను తినటం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. అంతే కాకుండా వీటిలో కొవ్వు కూడా చాలా తక్కువగా ఉంటుంది.

 

వేసవిలో పెరుగన్నం తప్పనిసరిగా తినాలి. పెరుగులో ఉండే ప్రోబయాటిక్స్‌ పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా చని పోకుండా కాపాడుతుంది. అంతే కాకుండా పెరుగున్నం తినటం వల్ల ఎక్కువ సమయం ఆకలి కూడా వేయదు.

Mung bean sprouts | How to sprout mung beans - Traditionally Modern Food