Last Updated:

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదంలో ఎంత మంది తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఉన్నారంటే.. హెల్ప్‌లైన్‌ నంబర్లు ??

భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం నిలిచింది. ఈ విషాదకర ఘటన దేశ వ్యాప్తంగా ప్రజలను తీవ్రంగా కలచివేసింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 237 కు చేరగా.. 900 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది.

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదంలో ఎంత మంది తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఉన్నారంటే.. హెల్ప్‌లైన్‌ నంబర్లు ??

Odisha Train Accident : భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం నిలిచింది. ఈ విషాదకర ఘటన (Odisha Train Accident) దేశ వ్యాప్తంగా ప్రజలను తీవ్రంగా కలచివేసింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 237 కు చేరగా.. 900 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. ప్రమాదం రాత్రివేళ జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అయినా కానీ ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సహా రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాగా ఈ మేరకు ఈ ఘోర రైలు ప్రమాద ఘటనపై కేంద్రం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

ఇక, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో దాదాపు 70 మంది వరకూ ఏపీ ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా హౌరా, బాలేశ్వర్ వంటి స్టేషన్‌లో ఈ రైలును ఎక్కినట్టు సమాచారం. వీరంతా ఏపీలోని విజయనగరం, విశాఖ, రాజమండ్రి స్టేషన్‌లలో దిగాల్సి ఉంది. మరోవైపు, రైలు ప్రమాదానికి సంబంధించిన వివరాలు అందించేందుకు ఒడిశా, పశ్చిమ్ బెంగాల్‌ ప్రభుత్వాలు, రైల్వే శాఖ హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటుచేశాయి. ఈ రైళ్లలో తెలుగువారు ఎవరైనా ఉంటే వారి ఆచూకీ కోసం విశాఖపట్నం, విజయనగరం స్టేషన్లలో సంప్రదించేందుకు అధికారులు హెల్ప్‌లైన్‌ నంబర్లను ప్రకటించారు.

విశాఖపట్నం

0891-2746330, 0891-2744619

విజయవాడ

Rly – 67055

BSNL – 0866 2576924

0866-2576924

రాజమండ్రి

0883 2420541
65395

సికింద్రాబాద్: 040 – 27788516

రాజమండ్రి : 0883-2420541

సామర్లకోట : 7780741268

ఏలూరు : 08812-232267

తాడేపల్లిగూడెం : 08818-226212

బాపట్ల : 08643-222178

తెనాలి : 08644-227

విజయనగరం

0892-2221202, 0892-2221206

శ్రీకాకుళం

0894-2286213, 0894-2286245

ఒడిశా హెల్ప్‌లైన్ నంబర్‌

06782262286

రైల్వే శాఖ హెల్ప్‌లైన్‌ నంబర్లు

హౌరా 033-26382217

ఖరగ్‌పూర్‌ 8972073925

బాలాసోర్‌ 8249591559

చెన్నై 044-25330952

పశ్చిమబెంగాల్‌ హెల్ప్‌లైన్‌ నంబర్లు

033-22143526, 033-22535185

తెలుగు రాష్ట్రాల సీఎంల స్పందన.. 

ఈ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన జగన్‌ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారా? లేదా? అన్నదానిపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులను వెల్లడించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ కోరారు.
తమిళనాడుకు చెందిన ప్రయాణికులు భారీ సంఖ్యలో ఉండటంతో సీఎం ఎంఎకే స్టాలిన్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు కు కాల్ చేసి వివరాలు తెలుసుకున్నారు. తమిళనాడుకు చెందిన కొందరు ఐఏఎస్ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.