Dharmavaram: భార్య నల్లపూసల గొలుసు మింగేసిన భర్త.. చివరికి
అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి భార్య నల్లపూసల గొలుసు మింగేశాడు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. చివరకు అతనికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యలు హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
Dharmavaram: అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి భార్య నల్లపూసల గొలుసు మింగేశాడు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. చివరకు అతనికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యలు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో అతని పొట్టలో గొలుసు ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. ఆపరేషన్ చేసి గొలుసును బయటకు తీయాలని వైద్యులు సూచించారు. అయితే అంత ఖర్చు భరించలేమంటూ.. బాధితులు జిల్లా ప్రభుత్వ హాస్పటిల్ కు తీసుకెళ్లారు. అక్కడ ఈఎన్ టీ డాక్టర్ల టీమ్ ఎలాంటి సర్జరీ లేకుండానే నోటి ద్వారా గొలుసును బయటకు తీశారు.
తీవ్రమైన కడుపు నొప్పితో(Dharmavaram)
డాక్టర్లు చెప్పిన వివరాల ప్రకారం.. ధర్మవరానికి చెందిన రామాంజనేయులు (45) అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం తన భార్యకు చెందని రోల్డ్ గోల్డ్ నల్ల పూసల గొలుసును మింగేశాడు. అయితే ఆ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. ఈ క్రమంలో అతనికి ఈ మధ్య తీవ్రమైన కడుపు నొప్పి వస్తుండటంతో విషయం ఇంట్లో వాళ్లు చెప్పాడు. దీంతో వారు అతనిని అనంతపురంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించారు. చికిత్స కు వేలల్లో ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో.. జిల్లా ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుకుమార్.. రామాంజనేయులును పరీక్షించారు. జరిగిన విషయం పై ఆరా తీయగా.. తాను గొలుసు మింగానని, ఏమీ తిన్నా ఇబ్బందిగా ఉందని చెప్పడంతో ఎక్స్‌రే తీశారు.
ఫ్లెక్సిబుల్ గ్యాస్ట్రో ఎండోస్కోపీ ద్వారా(Dharmavaram)
రామాంజనేయులు అన్నవాహిక వద్ద నల్లపూసల గొలుసు డాలర్ ఇరుక్కుని ఉండటాన్ని డాక్టర్లు గుర్తించారు. దీంతో వైద్యులు అతడికి ఆపరేషన్ లేకుండానే కడుపులో ఉండిపోయిన నల్లపూసల గొలుసు బయటకు తీయాలని నిర్ణయించారు. మే 30న అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సుకుమార్ ల టీమ్ ఫ్లెక్సిబుల్ గ్యాస్ట్రో ఎండోస్కోపీ ద్వారా నల్లపూసల గొలుసును బయటకు తీశారు. ప్రస్తుతం రామాంజనేయులు ఆరోగ్యంగా ఉన్నట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ సుకుమార్ తెలిపారు. శస్త్ర చికిత్స లేకుండా కడుపు లోపల ఉన్న గొలుసును బయటకు తీసిన వైద్యులను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ అభినందనలు తెలిపారు.