Last Updated:

Shiridi Pandharpur Tour: పండరీపురానికి తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీ..

మన దేశంలో ఎన్నో చూడదగిన విష్ణుమూర్తి ఆలయాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ముఖ్యమైంది మహారాష్ట్రలోని పండరీపుర్‌ దేవాలయం. స్థానికంగా ఇక్కడ ప్రజలు పాండురంగ స్వామిని విఠలుడు అని పిలుచుకుంటారు. అధ్యాత్మిక టూరిజంలో భాగంగా పండరీపుర్‌, షిరిడీ వెళ్లే పర్యాటకుల కోసం తెలంగాణ టూరిజం సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.

Shiridi Pandharpur Tour: పండరీపురానికి తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీ..

Shiridi Pandharpur Tour: మన దేశంలో ఎన్నో చూడదగిన విష్ణుమూర్తి ఆలయాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ముఖ్యమైంది మహారాష్ట్రలోని పండరీపుర్‌ దేవాలయం. స్థానికంగా ఇక్కడ ప్రజలు పాండురంగ స్వామిని విఠలుడు అని పిలుచుకుంటారు. అధ్యాత్మిక టూరిజంలో భాగంగా పండరీపుర్‌, షిరిడీ వెళ్లే పర్యాటకుల కోసం తెలంగాణ టూరిజం సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘షిర్డీ పండరీపుర్‌ టూర్’ పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. బస్సు మార్గంలో ఈ టూర్‌ను ఆపరేట్ విశేషాలేంటో చూద్దాం.

ప్రతి శ‌నివారం ఈ టూర్ ప్రారంభమవుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో పండరీపుర్‌ , షిర్డీ , శ‌ని శింగణాపూర్ లాంటి అధ్యాత్మిక ప్రాంతాలు సందర్శించుకోవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. ఈ టూర్ 3 రాత్రులు, 4 రోజులు కొనసాగుతుంది.

‘షిర్డీ పండరీపుర్‌ టూర్’ సాగుతుందిలా..(Shiridi Pandharpur Tour)

మొదటి రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. దిల్‍సుఖ్‍నగర్ సాయిబాబా టెంపుల్ నుంచి మధ్యాహ్నం 03:00 గంటలకు బ‌స్సు బయలు దేరుతుంది.

బషీర్‌బాగ్‌లో సాయంత్రం 4 గంటలకు.. యాత్రి నివాస్, సర్దార్ పటేల్ రోడ్, ప్యారడైజ్ సర్కిల్ నుంచి సాయంత్రం 5 గంటలకు, పర్యాటక్ భవన్, బేగంపేట్ నుంచి సాయంత్రం 5.15 గంటలకు,

కేపీహెచ్‌బీ VRK సిల్క్స్ నుంచి సాయంత్రం 6.15 గంట‌ల‌కు, చందానగర్ నుంచి సాయంత్రం 6.30 గంట‌ల‌కు బయలు దేరుతుంది. నైట్ జర్నీ కొనసాగుతుంది.

రెండో రోజు ఉదయం శ‌ని శింగణాపూర్ చేరుకుంటారు. అక్కడ ప్రెష్ అయి శని దేవుడిని దర్శనం చేసుకుంటారు. తర్వాత షిర్డీకి బ‌య‌లు దేరుతారు.

ఉదయం 11 గంట‌ల‌కు షిర్డీ చేరుకున్న త‌ర్వాత‌ హోటల్‌లో చెక్ ఇన్ అయి ఆలయం దర్శనం ఉంటుంది. భోజనం త‌ర్వాత రాత్రి షిర్డిలోనే బస ఉంటుంది.

మూడో రోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు షిర్డీ నుంచి పండరీపుర్‌కు బయలు దేరుతారు.

పండరీపుర్ చేరుకున్న తర్వాత చంద్రభాగా నదిగా పిలవబడుతున్న భీమా నదిలో స్నానాలు చేసి తర్వాత నదికీ సమీపంలో ఉన్న పుండరీకుని మందిరానికి చేరుకుంటారు.

పాండురంగడి దర్శనం చేసుకుని తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణం అవుతారు.

తెల్లవారుజామున ఉదయం 6 గంటలకు హైద‌రాబాద్‌ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

 

Hyderabad to Pandharpur | Pandaripuram, Shirdi trip for 3 thousand.. Telangana  tourism special package-Namasthe Telangana
‘షిర్డీ పండరీపుర్‌ టూర్’ ప్యాకేజీ ధ‌ర

హైదరాబాద్ నుంచి పండరీపూర్ కు నాన్ AC బస్సు ప్యాకేజీలో పెద్దలకు రూ. 3100, పిల్లలు (5 నుంచి 12ఏళ్లు) రూ. 2530 చెల్లించాల్సి ఉంటుంది.

ఇక టూర్ ప్యాకేజీలో బ‌స్సు టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ లు కవర్ అవుతాయి. రవాణా, వసతి ప్యాకేజీలో ఉంటుంది.

నోట్ : ఆహారం, దర్శనం, ఇతర ఖర్చులు పర్యాటకులే భరించాలి

పూర్తి వివరాల కోసం telangana tourism వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

 

Best Shirdi Tour Packages from Chennai By Flight - Shirdi Trip

ఇవి కూడా చదవండి: