Last Updated:

TSPSC’s Decision: ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో టిఎస్‌పిఎస్‌సి కీలక నిర్ణయం.. 37 మంది డిబార్

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. కేసులో అరెస్టైన అభ్యర్థులని డిబార్ చేయాలని టిఎస్‌పిఎస్‌సి నిర్ణయించింది. భవిష్యత్తులో టిఎస్‌పిఎస్‌సి నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా చేయాలని డిసైడైన అధికారులు 37మంది నిందితులకి నోటీసులిచ్చారు

TSPSC’s  Decision: ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో టిఎస్‌పిఎస్‌సి కీలక నిర్ణయం.. 37 మంది డిబార్

TSPSC’s  Decision: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. కేసులో అరెస్టైన అభ్యర్థులని డిబార్ చేయాలని టిఎస్‌పిఎస్‌సి నిర్ణయించింది. భవిష్యత్తులో టిఎస్‌పిఎస్‌సి నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా చేయాలని డిసైడైన అధికారులు 37మంది నిందితులకి నోటీసులిచ్చారు. అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

ChatGPTని ఉపయోగించి..(TSPSC’s Decision)

పెద్దపల్లిలో తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌లో డివిజనల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పూల రమేష్ (35)ను సిట్ పట్టుకోవడంతో విస్మయకర వివరాలు వెలుగులోకి వచ్చాయి.రమేష్ మూడు లీక్ అయిన ప్రశ్నా పత్రాలను పరిశీలించి వాటిలో రెండింటికి సమాధానాలు పొందడానికి ChatGPTని ఉపయోగించాడు. జనవరి 22 మరియు ఫిబ్రవరి 26 తేదీల్లో నిర్వహించిన రెండు పరీక్షలకు కూర్చున్న ఏడుగురు అభ్యర్థులకు సమాధానాలు చెప్పేందుకు రమేష్ విస్తృతమైన ప్రణాళికను రూపొందించినట్లు దర్యాప్తులో వెల్లడయిందని సమాచారం.

పరీక్ష ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత పరీక్షా కేంద్రంలోని ప్రిన్సిపాల్ ప్రశ్నాపత్రాల ఫోటోలను తీసి రమేష్‌కు పంపినట్లు భావిస్తున్నారు. మరో ప్రదేశంలో తన నలుగురు సహచరులతో కూర్చున్న రమేష్, సరైన సమాధానాలను పొందడానికి చాట్‌జిపిటిని ఉపయోగించాడు. దాని ద్వారా అభ్యర్థులకు సమాధానాలు పంపించాడు. ఏడుగురిలో ఒక్కొక్కరు ఉత్తీర్ణత సాధించేందుకు రూ.40 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారని తెలుస్తోంది.