IPL 2023 prize: ఐపీఎల్ 16 విన్నర్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 తుది సమరానికి చేరుకుంది. ఆదివారం (మే 28) న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. టైటిల్ పోరులో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తలపడనున్నాయి.
IPL 2023 prize: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 తుది సమరానికి చేరుకుంది. ఆదివారం (మే 28) న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. టైటిల్ పోరులో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ కావడంతో ఏ జట్టు గెలుస్తుందన్న దానిపై ఇప్పటికే అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఐపీఎల్ 16 విజేతకు ఎంత ప్రైజ్ మనీ వస్తుంది.. రన్నర్ గా నిలిచిన జట్టు ఎంత మొత్తాన్ని దక్కించుకుంటుందో చూద్దాం.
స్టార్ స్పోర్ట్స్ రిపోర్టు ప్రకారం ఈ ఐపీఎల్ సీజన్‌లో విన్నర్ అయ్యే టీమ్ రూ. 20 కోట్లు ప్రైజ్‌మనీగా గెలుచుకుంటుంది. అదే విధంగా రన్నరప్‌గా నిలిచే టీమ్‌కు రూ. 13 కోట్లు ఇవ్వనున్నారు. మూడో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ రూ. 7 కోట్ల నగదు బహుమతి దక్కనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడి పోయి నాల్గో స్థానంతో సరిపెట్టుకున్న లక్నో సూపర్ జెయింట్స్ కు రూ. 6.5 కోట్ల క్యాష్ రివార్డు ఇవ్వనున్నారు.
ఆరెంజ్ క్యాప్ హోల్టర్ కు(IPL 2023 prize)
కాగా ఈ సీజన్ లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ అందిస్తారు. కాగా, ఆరెంజ్ క్యాప్ లిస్ట్ లో గుజరాత్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ 16 మ్యాచ్ లు ఆడి.. 851 పరుగులతో టాప్ లో ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ అందుకునే ప్లేయర్ కు రూ. 15 లక్షలను ప్రైజ్ మనీగా ఇస్తారు.
అదే విధంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్ అందిస్తారు. ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌కు కూడా రూ. 15 లక్షల ప్రైజ్‌మనీ అందిస్తారు. ప్రస్తుతం గుజరాత్ పేసర్ మహ్మద్ షమి 28 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో రషీద్ ఖాన్ (27), మోహిత్ శర్మ (24) ఉన్నారు.
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన ప్లేయర్‌కు రూ. 20 లక్షలు, అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన ప్లేయర్ కు రూ. 12 లక్షలు ప్రైజ్‌మనీగా దక్కుతుంది. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచిన ప్లేయర్ రూ. 15 లక్షలు, గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచిన ప్లేయర్ రూ. 12 లక్షలు దక్కించు కుంటారు.