Kaleshwaram Project tour: ఈ వీకెండ్ లో ‘కాళేశ్వరం’ చూసొద్దామా..
తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక ప్యాకేజీకి ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి ఒక రోజు టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
Kaleshwaram Project tour: వేసవిలో చాలామంది వెకేషన్స్ కు వెళ్లేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారు. ఈ టూర్స్ దూరం వెళ్లలేని వాళ్లు.. ఒకటి, రెండు రోజుల్లో పూర్తి అయ్యే వాటి కోసం ఎక్కువగా ప్లాన్ చేసుకుంటారు. అలాంటి వారి కోసం తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక ప్యాకేజీకి ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి ఒక రోజు టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
కాళేశ్వరం ప్యాకేజ్ టూర్ పేరుతో తెలంగాణ టూరిజం ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా రామప్ప దేవాలయం, మేడిగడ్డ బ్యారేజ్, కనేపల్లి పంప్ హౌజ్, కాళేశ్వర ఆలయం తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు.
కాళేశ్వరం టూర్ ఎలా సాగుతుందంటే..(Kaleshwaram Project tour)
హైదరాబాద్ లో ప్రతి శనివారం, ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు టూర్ ప్రారంభమవుతుంది. సికింద్రాబాద్ లోని యాత్రా నివాస్ నుంచి కాలేశ్వరం బస్సు బయలు దేరుతుంది. ఉదయం 8 గంటలకు వరంగల్‌లోని హరిత కాకతీయ హోటల్‌కు చేరుకుంటుంది. అక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత రామప్పలో రామలింగేశ్వర స్వామి ఆలయ దర్శనం ఉంటుంది.
అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజీ, కనేపల్లి పంప్ హౌజ్ కు తీసుకువెళతారు. అక్కడ నుంచి సాయంత్రం 4 గంటలకు కాళేశ్వర ఆలయంలో దర్శనం ఉంటుంది. అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 11 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు
కాళేశ్వరం ప్యాకేజ్ టూర్ కు పెద్దలకు రూ. 1850, పిల్లలకు (5 నుంచి 12 సంవత్సరాలు) రూ. 1490 లుగా టూరిజం శాఖ నిర్ణయించింది. టూర్ ప్యాకేజీలో బస్సు టికెట్లు, దర్శనం, హోటల్లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. పూర్తి వివరాల కోసం తెలంగాణ టూరిజం శాఖ వెబ్ సైట్ లో (https://tourism.telangana.gov.in/package/KaleshwaramTour) సంప్రదించవచ్చు. Toll Free: 1800-425-46464 ఈ నెంబర్ కి కాల్ చేసి వివరాలు కూడా తెలుసుకోవచ్చు.
వేసవి సెలవుల్లో..
తెలంగాణ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు కూడా ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలంలోని కన్నెపల్లి గ్రామం వద్ద గోదావరి నిదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు అత్యద్భుతమైన భారీ కట్టడంగా సందర్శకులను విశేషంగా ఆకర్శిస్తోంది. రూ. 1. 20లక్షల కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నిర్మాణమైన అతిపెద్ద ప్రాజెక్టు. కొన్ని బ్యారేజీలు, పంపు హౌస్‌లు, కాలువలు, సొరంగాల సమాహారం అయిన ఈ ప్రాజెక్టును సందర్శించడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. వేసవి సెలవుల్లో దర్శనీయ స్థలాల్లో ఒకటిగా దీనిని ఎంచుకోవచ్చు. ప్రాజెక్టుకు దగ్గరలోనే సుప్రసిద్ధ కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయం కూడా ఉంది. ఇది కూడా ప్రముఖ దర్శనీయ క్షేత్రాల్లో ఒకటి. కాళేశ్వరం ఎత్తిప్రాజెక్టు ప్రాంగణంలో సందర్శకుల కోసం కాటేజీలను కూడా నిర్మించారు