జానపద ఔషధాలలో శతాబ్దాలుగా ఈ మొక్క ఆకులు, పువ్వులు, విత్తనాలను ఉపయోగిస్తున్నారు.
మధుమేహం, దీర్ఘకాలిక మంట, బాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, కీళ్ళ నొప్పి, గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్, ఆర్థరైటిస్, అధిక రక్త పోటు వంటి రోగాలను సయం చేయడంలో సహాయపడుతుంది
మునగ ఆకుల్లో నారింజ కంటే 7 రెట్లు ఎక్కువ విటమిన్ సి, అరటిపండ్ల కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది.
మునగాకులో కనిపించే ఇన్సులిన్ లాంటి ప్రోటీన్లు రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.
మునగాకులోని యాంటీఆక్సిడెంట్‌లలో కొన్ని రక్తపోటును తగ్గించగలవని , రక్తం , శరీరంలో కొవ్వును తగ్గించగలవని కొన్ని ఆధారాలు ఉన్నాయి.