Telangana Eamcet 2023 : తెలంగాణ ఎంసెట్-2023 ఫలితాలు రిలీజ్.. టాప్ ర్యాంకులు కొట్టి సత్తా చాటిన ఏపీ విద్యార్ధులు
తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎంసెట్ ఫలితాలు తాజాగా రిలీజ్ అయ్యాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 86 శాతం మంది ఉత్తీర్ణతను సాధించారు. కాగా ఇంజినీరింగ్ విభాగంలో
Telangana Eamcet 2023 : తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎంసెట్ ఫలితాలు తాజాగా రిలీజ్ అయ్యాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 86 శాతం మంది ఉత్తీర్ణతను సాధించారు. కాగా ఇంజినీరింగ్ విభాగంలో 1,95,275 మంది పరీక్ష రాయగా.. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 1,06,514 మంది పరీక్ష రాశారు. కాగా పలు టెక్నికల్ కారణాల వల్ల అఫిషియల్ సైట్ క్రాష్ అయినట్లు తెలుస్తుంది. దాంతో పలు సైట్లలో స్టూడెంట్స్ ఫలితాలను తెలుసుకుంటున్నారు.
అదే విధంగా ఇంజినీరింగ్ విభాగంలో 1,56,879 మంది ఉత్తీర్ణత సాధించగా.. అందులో 82 శాతం మంది అమ్మాయిలు.. 79 శాతం మంది అబ్బాయిలు ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 87 శాతం మంది అమ్మాయిలు.. 84 శాతం మంది అబ్బాయిలు ఉత్తీర్ణత పొందారు. త్వరలోనే అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి సబిత ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఫలితాల్లో ఈసారి అబ్బాయిలు హవా చాటారు. ఇంజనీరింగ్, అగ్రకల్చర్ స్ట్రీమ్లలో టాప్ ర్యాంకులన్నీ అబ్బాయిలే సాధించడం విశేషం. అయితే ఈ ఎంసెట్ ఫలితాల్లో టాప్ 3 ర్యాంకులు ఏపీ విద్యార్ధులు సాధించడం గమనార్హం. కాగా ముందుగా టాపర్ల వివరాలు..
ఇంజినీరింగ్ టాప్ ర్యాంకర్లు..
మొదటి ఫస్ట్ ర్యాంక్ – శనపాల అనిరుధ్
రెండవ ర్యాంక్ – యాకంటిపల్లి మునీందర్ రెడ్డి
మూడవ ర్యాంక్ – చల్లా ఉమేశ్ వరుణ్
నాలుగవ ర్యాంక్ – అభినిత్ మంజేటి
ఐదవ ర్యాంక్ – ప్రమోద్ కుమార్.
అగ్రికల్చర్, మెడిసిన్ టాప్ ర్యాంకర్లు (Telangana Eamcet 2023)..
ఫస్ట్ ర్యాంక్ – బూరుగుపల్లి సత్య
సెకండ్ ర్యాంక్ – ఎన్. వెంకటతేజ
థర్డ్ ర్యాంక్ – సఫల్ లక్ష్మి
ఫోర్త్ ర్యాంక్ – కార్తికేయ రెడ్డి
ఫిఫ్త్ ర్యాంక్ – బి. వరుణ్ చక్రవర్తి
వీరిలో ఇంజనీరింగ్ విభాగంలో ఫస్ట్ ర్యాంక్ (158.89) సాధించిన అనిరుద్ సనపల్ల.. విశాఖపట్నంకి చెందినవాడు. సెకండ్ ర్యాంక్ (156.59)లో నిలిచిన ఎక్కంటిపాని వెంకట మనిందర్ రెడ్డి గుంటూరుకు చెందిన విద్యార్ధి. మూడో ర్యాంక్ (156.94) సాధించిన చల్లా రమేష్ కృష్ణా జిల్లా నందిగామ వాసి.
అగ్రికల్చర్, ఫార్మసీలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన బురుగుపల్లి సత్య తూర్పు గోదావరికి చెందిన విద్యార్ధి. రెండో ర్యాంక్ పొందిన నాసిక వెంకట తేజ చీరాలకు చెందిన వారు. తెలంగాణలోని రంగారెడ్డికి చెందిన సఫల్ లక్ష్మి పసుపులేటి మూడో ర్యాంక్. తెనాలికి చెందిన దుర్గెంపూడి కార్తికేయ రెడ్డి నాల్గవ ర్యాంక్. శ్రీకాకుళంకు చెందిన బోర వరున్ చక్రవర్తి 5వ ర్యాంకు సాధించారు.