Decision on CPS: బొత్స నోట మరో మారు సిపిఎస్ పాట
పూటకో ఆలోచన. రోజుకో మాట. ఇది నేటి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ పెద్దల మాటలు...సిపిఎస్ పై తొందర పడ్డామని చెప్పిన మంత్రి బొత్స సత్యన్నారాయణ మరో మారు సిపిఎస్ పై రెండు నెలల్లో నిర్ణయం తీసుకొంటామంటూ వాయిదా పద్దతిని చేపట్టారు
Amaravathi: వైకాపా ఇచ్చిన హామీ వాస్తవం. పొరపాటున తొందరపడి వాగ్దానం చేసాం. ఇప్పుడు కుదరడం లేదని చెప్తున్నాం. ఇదీ సిపిఎస్ విధానంపై మంత్రి బొత్స సత్యన్నారాయణ ఉద్యోగులతో చెప్పిన మాట. తాజాగా మరోమారు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్) పై బొత్స మాట్లాడారు. రెండు నెలల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తామని మీడియాతో పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయంలో వంద హామీలు ఇచ్చాం. అన్ని హామీలు నెరవేర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఉద్యోగుల క్రమబద్ధీకరణ డిసెంబర్ లోగా పరిష్కరిస్తామన్న మంత్రి సిపిఎస్ పై ప్రభుత్వం తీసుకొనే నిర్ణయం ఆమోదయోగ్యంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే సిపిఎస్ విధానంలో ఉద్యోగులతో తలెత్తిన సంక్షోభానికి ప్రభుత్వం నెత్తి నోరు కొట్టుకొంటుండగా తాజాగా మంత్రి బొత్స తొందర పడ్డామని చెబుతూనే మరో రెండు నెలల వాయిదా వేయడం పట్ల వ్యవహారం కాస్తా మరింత జఠిలంగా మారనుంది.