BRS Meeting: ఈ నెల 17న బీఆర్ఎస్ కీలక సమావేశం.. నెల వ్యవధిలోనే మరోసారి
BRS Meeting: ఈ నెల 17న బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. నెల వ్యవధిలోనే మరోసారి సమావేశం కానుండటంతో.. దీనిపై ఉత్కంఠ నెలకొంది.
BRS Meeting: ఈ నెల 17న బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. నెల వ్యవధిలోనే మరోసారి సమావేశం కానుండటంతో.. దీనిపై ఉత్కంఠ నెలకొంది. బుధవారం కేసీఆర్ అధ్యక్షతన.. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.
కీలక సమావేశం (BRS Meeting)
ఈ నెల 17న బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. నెల వ్యవధిలోనే మరోసారి సమావేశం కానుండటంతో.. దీనిపై ఉత్కంఠ నెలకొంది. బుధవారం కేసీఆర్ అధ్యక్షతన.. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.
ఈ నెల 17న బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ, పార్లమెంటరీ పార్టీల సమావేశం జరగనుంది. కేసీఆర్ ఆధ్యక్షతన.. బుధవారం ఈ సమావేశం జరగనుంది. పార్టీ ఆవిర్భావం సందర్భంగా.. గత నెల 27న సమావేశమైన కేసీఆర్.. తిరిగి 20 రోజుల్లోనే సమావేశం అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ఏం విషయాలపై చర్చిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
కర్ణాటక ఎన్నికల అనంతరం ఈ సమావేశం జరగనుండటంతో.. ఎలాంటి విషయాలపై చర్చిస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. జూన్ 2 నుంచి జరిగే రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ వేడుకల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రధానాంశంగా సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీవర్గాలు పేర్కొన్నాయి.
గత నెల 27న జరిగిన సమావేశంలో.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పథకంలో కొందరు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారంటూ గట్టిగా హెచ్చరించారు. శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని, ప్రజలకు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బుధవారం నిర్వహించనున్న సమావేశంలో కర్ణాటక ఫలితాలను విశ్లేషించడంతో పాటు.. రాష్ట్రంలోని స్థితిగతులపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా రానున్న శాసనసభ ఎన్నికలను ఎదుర్కోవడంలో అనుసరించాల్సిన వ్యూహాలపై భారాస అధినేత దిశానిర్దేశం చేస్తారని సమాచారం.