SRH vs LSG: ఆ ఇద్దరు ప్లేయర్స్ పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఆగ్రహం.. జరిమానా
ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓటమిని చవి చూసింది. లక్నో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
SRH vs LSG: ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓటమిని చవి చూసింది. లక్నో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ లీగ్ ప్లేఆఫ్ రేసు నుంచి సన్ రైజర్స్ నిష్క్రమించింది. కాగా, ఈ మ్యాచ్ లో లక్నో పై కీలక ఇన్నింగ్స్ ఆడిన ఎస్ఆర్ హెచ్ వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్‌కు జరిమానా పడింది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు క్లాసెన్‌కు మ్యాచ్ రిఫరీ ఫైన్ వేశారు.
దీంతో అతడి మ్యాచ్‌లో 10 శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. క్లాసెన్ లెవెల్ 1 నేరం కింద, ఈ విషయంలో మ్యాచ్ రిషరీదే తుది నిర్ణయమని నిర్వాహకులు తెలిపారు. నో బాల్ వ్యవహారం తర్వాత థర్డ్ అంపైర్ నిర్ణయం పై అసంతృప్తి వ్యక్తం చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
మరోవైపు లక్నో స్పిన్నర్ అమిత్ మిశ్రాకు కూడా ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో ఎక్విప్‌మెంట్‌పై అతను ప్రతాపం చూపించినందుకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్టు కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది.
నో బాల్ వివాదం ఏంటంటే..(SRH vs LSG)
లక్నో, సన్‌రైజర్స్ మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ ఇన్నింగ్స్‌లో 19 ఓవర్ ను ఆవేశ్ ఖాన్ వేశాడు. ఈ ఓవర్ మూడో బంతి హైఫుల్ టాస్‌గా వెళ్లింది. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. అయితే లక్నో కెప్టెన్ అంపైర్ కాల్‌ను చాలెంజ్ చేశాడు. అయితే రిప్లేలో చూసిన థర్డ్ అంపైర్ బంతి క్లియర్‌గా ఉండటంతో నో బాల్ కాదని చెప్పాడు. నడుము పై నుంచి బంతి వెళ్లినా.. థర్డ్ అంపైర్ ఫెయిర్ డెలివరీగా ప్రకటించడం క్రీజులో ఉన్న సమద్, క్లాసెన్‌తో పాటు అభిమానులను కూడా షాక్‌కు గురిచేసింది.
ఈ క్రమంలో క్లాసెన్ లెగ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అదే విధంగా ఎస్ఆర్హెచ్ అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేశారు. నట్టులు, మేకులు లక్నో డగౌట్పైన విసిరారు. దీంతో కాసేపు మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. కాగా అంపైర్‌తో వాగ్వాదం వల్ల క్లాసెన్‌కు జరిమానా పడినట్లు తెలుస్తోంది.