Last Updated:

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారికి పెళ్లి సంబంధం వాయిదా పడే అవకాశం ఉందని తెలుసా..!

జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి పెళ్లి సంబంధం వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే మే 14 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారికి పెళ్లి సంబంధం వాయిదా పడే అవకాశం ఉందని తెలుసా..!

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి పెళ్లి సంబంధం వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే మే 14 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

కుటుంబ సభ్యులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతారు. ఆలయాలు సందర్శిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. వ్యాపారులు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెళ్లి సంబంధం విషయంలో చికాకులు ఎదురవుతాయి. బంధువులు కొందరు సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యమైన పనులు తేలికగా పూర్తవుతాయి. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రేమ జీవితంలో ముందడుగు వేస్తారు.

వృషభం..

అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. ఇతరులకు వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం విరమించడం మంచిది. ఉద్యోగంలో పని భారం పెరిగి ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం సొంత ఊరులోనే లభిస్తుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. దూర ప్రాంతం నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రేమ జీవితం పట్ల కొద్దిగా ఆసక్తి తగ్గుతుంది.

మిథునం..

వ్యాపారంలోను, ఉద్యోగంలోనూ ఇబ్బందులు, చికాకులు ఎదురవుతున్నప్ప టికీ పట్టుదలగా ముందుకు దూసుకుపోతారు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ప్రేమ జీవితం సాఫీగా సాగిపోతుంది.

కర్కాటకం..

సన్నిహితుల సహకారంతో కొత్త వ్యాపారం చేపట్టడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. బంధువులు కొందరు మీ సలహాలను తీసుకుని ప్రయోజనం పొందుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. నిరుద్యోగులకు తీపి కబురు అందుతుంది. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. ఆహార విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది.ప్రేమ వ్యవహారాలు పెళ్లి మాటలకు దారితీస్తాయి.

సింహం..

ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో చక్కబడుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా సాగుతాయి.పెళ్లి సంబంధం వాయిదా పడే అవకాశం ఉంది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యక్తిగత పనులను పూర్తిచేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు ఎదురవుతాయి.

కన్య..

దూర ప్రాంతం నుంచి శుభవార్త ఒకటి అందుతుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఒకటి రెండు ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఒకటి రెండు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని రకాల వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

తుల..

ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. అదృష్ట యోగం పడుతుంది. ఇతరులకు వాగ్దానాలు చేయడం కానీ, హామీలు ఉండటం కానీ చేయకపోవడం మంచిది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం కనిపిస్తోంది. వృత్తి వ్యాపారాలు సజావుగా ముందుకు సాగిపోతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. పరిచయస్తులలో మంచి పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు.

ఈ రాశుల వారికి ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు వచ్చే అవకాశం (Daily Horoscope)..

వృశ్చికం..

వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఒకరిద్దరు బంధువులతో విరోధం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. రుణ దాతల దగ్గర నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం జాగ్రత్త.

ధనుస్సు..

ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. బంధువుల వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన వ్యక్తిగత పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి.

మకరం..

ఆర్థిక పరిస్థితుల్లో కూడా సానుకూలమైన మార్పు కనిపిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. కుటుంబంలో ఒకటి రెండు సమస్యలు అప్రయత్నంగా చక్కబడతాయి. వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఆహార విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా నిరుత్సాహం కలిగిస్తాయి.

కుంభం..

ఆర్థిక పరిస్థితి ఆశించినంతగా మెరుగుపడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇతర సంస్థలకు మారే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. బంధువులు గానీ, కొందరు మిత్రులు గానీ అపార్థం చేసుకునే సూచనలు ఉన్నాయి. ఐటి నిపుణులకు మంచి పురోగతి కనిపిస్తోంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

మీనం..

ఒక మంచి శుభ పరిణామం చోటుచేసుకుని జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. బంధు వర్గం నుంచి ఒక మంచి పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒకరిద్దరు సన్నిహితులకు సహాయం చేయడం జరుగుతుంది. కుటుంబంలో దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగ పరంగా ఆశించిన ప్రయోజనం అనుభవానికి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి.