Karnataka Election Result: కర్ణాటకలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్
Karnataka Election Result: కర్ణాటక రాష్ట్రంలో ఫలితాలపై ఎన్నికల సంఘం వివరాలు వెల్లడించింది. ఈ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తుంది.
Karnataka Election Result: కర్ణాటకలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 34 జిల్లాల్లో 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
కర్ణాటక రాష్ట్రంలో ఫలితాలపై ఎన్నికల సంఘం వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం.. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం.. కాంగ్రెస్ 115 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ 78 స్థానాల్లో, జేడీఎస్ 26 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
LIVE NEWS & UPDATES
-
Karnataka Election Result: ఖర్గే తనయుడి విజయం..
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తనయుడు.. ప్రియాంక్ విజయం సాధించాడు. చిత్తాపూర్ స్థానం నుంచి ఆయన గెలుపొందారు.
-
Karnataka Election Result: కర్ణాటక కాంగ్రెస్ వశం.. మ్యాజిక్ ఫిగర్ స్థానాలను గెలిచిన హస్తం
కర్ణాటకను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 113 స్థానాలు గెలుచుకుని మరో 19 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుంది.
-
Karnataka Election Result:18 గెలుపు ముంగిట కాంగ్రెస్.. 53 స్థానాల్లో విజయం
ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల్లో కాంగ్రెస్ 53 స్థానాల్లో విజయం సాధించింది. 48 స్థానాల్లో మందంజలో ఉంది.
-
Karnataka Election Result: ఓటమిని అంగీకరించిన సీఎం బసవరాజ్ బొమ్మై
ఈ ఎన్నికల్లో భాజపా అనుకున్న ఫలితాలను సాధించలదేని సీఎం బసరాజ్ బొమ్మై మీడియాకు వివరించారు. ఈ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేసిస్తామని తెలిపారు.
-
Karnataka Election Result: మాజీ సీఎం జగదీష్ షెట్టర్ ఓటమి..
మాజీ సీఎం జగదీష్ షెట్టర్ ఓటమిపాలయ్యారు. ఇక ఇప్పటి వరకు కాంగ్రెస్ 30 స్థానాల్లో విజయం సాధించింది.
-
Karnataka Election Result: 18 స్థానాల్లో కాంగ్రెస్.. 5 స్థానాల్లో భాజపా
ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 18 స్థానాల్లో గెలుపొందగా.. భాజపా 5 స్థానాల్లో గెలుపొందింది.
-
Karnataka Election Result: సీఎం బొమ్మై విజయం
కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై విజయం సాధించారు. షిగ్గావ్ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు.
-
Karnataka Election Result: పది స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్
ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల్లో కాంగ్రెస్ పది స్థానాల్లో గెలిచింది.
-
Karnataka Election Result: కనకపురాలో డీకే శివకూమార్ గెలుపు
కనకపురా నుంచి బరిలో నిలిచిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ విజయం సాధించారు.
-
Karnataka Election Result:మెజార్టీ మార్కును దాటేసిన కాంగ్రెస్.. 120 స్థానాల్లో ఆధిక్యం
ఎగ్జిట్ పోల్స్ ను కాంగ్రెస్ తలకిందులు చేస్తుంది. మెజార్టీ మార్కును మించి లీడ్ లో కొనసాగుతుంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ 120 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.
-
Karnataka Election Result: మెజార్టీ మార్కును దాటేసిన కాంగ్రెస్..
కాంగ్రెస్ దూసుకెళ్తుంది. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన స్థానాల మార్కును దాటేసింది. ప్రస్తుతానికి కాంగ్రెస్ 115 స్థానాల్లో ముందంజలో ఉంది.
-
Karnataka Election Result: దూసుకుపోతున్న కాంగ్రెస్..
కాంగ్రెస్ 110 స్థానాల్లో దూసుకుపోతుంది. భాజపా 71 స్థానాల్లో.. జేడీఎస్ 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇతరులు 5 స్థానాల్లో ముందున్నారు.
-
Karnataka Election Result: ఎన్నికల ఫలితాలు.. మాజీ సీఎం వెనకంజ
కర్ణాటక ఎన్నికల్లో మాజీ సీఎం.. భాజపా రెబల్ నేత జగదీష్ శెట్టార్ వెనకంజలో ఉన్నారు.
-
Karnataka Election Result: ప్రముఖుల ఫలితాల సరళి ఎలా ఉందంటే?
- కర్ణాటక ముఖ్యమంత్రి, భాజపా నేత బసవరాజ్ బొమ్మై షిగ్గావ్‌లో ఆధిక్యంలో ఉన్నారు.
- కనకపురా స్థానంలో పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ ముందంజలో కొనసాగుతున్నారు.
- వరుణ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఆధిక్యంలో ఉన్నారు.
- చెన్నపట్టణ స్థానం నుంచి మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి తొలుత వెనుకబడినా.. ఇప్పుడు ఆధిక్యంలో ఉన్నారు.
- హోళెనరసిపూర్ నియోజకవర్గంలో రేవణ్ణ (జేడీఎస్) ఆధిక్యంలో ఉన్నారు.
- రామనగరలో నిఖిల్ కుమారస్వామి (జేడీఎస్) ముందంజలో కొనసాగుతున్నారు.
- గాలి జనార్దన్ రెడ్డి దంపతులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గంగావతి స్థానం నుంచి జనార్దన్ రెడ్డి, బళ్లారి పట్టణలో గాలి లక్ష్మీ అరుణ ముందంజలో ఉన్నారు.
- సొరబ స్థానంలో మాజీ సీఎం బంగారప్ప కుమారుల మధ్య గట్టి పోటీ నెలకొంది. కుమార బంగారప్ప (భాజపా)పై మధు బంగారప్ప (కాంగ్రెస్) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
- హుబ్బళి ధార్వాడ్ సెంట్రల్‌లో మాజీ సీఎం జగదీశ్ షెట్టార్ (కాంగ్రెస్) వెనుకంజలో ఉన్నారు.
- కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే చిత్తాపూర్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
- శికారిపురలో మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు విజయేంద్ర (భాజపా) ముందంజలో ఉన్నారు.
-
Karnataka Election Result: ఆధిక్యంలో తండ్రీ కొడుకులు..
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి, ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి ఇద్దరూ తమతమ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.