MI vs GT: సూర్య సూపర్ సెంచరీ.. గుజరాత్ లక్ష్యం 219 పరుగులు
MI vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్లో భాగంగా వాంఖడే వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది.
MI vs GT: సూర్యకూమర్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. 49 బంతుల్లో 103 పరుగులు చేశాడు. దీంతో ముంబయి 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది.
LIVE NEWS & UPDATES
-
MI vs GT: సూర్య విధ్వంసం.. 18వ ఓవర్లో 20 పరుగులు
సూర్య కుమార్ యాదవ్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. 18 ఓవర్ల చెలరేగి ఆడాడు. దీంతో 20 పరుగులు వచ్చాయి.
-
MI vs GT: సూర్య విధ్వంసం.. 36 బంతుల్లో 61 పరుగులు
సూర్య కుమార్ యాదవ్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. కేవలం 36 బంతుల్లో 61 పరుగులు చేశాడు.
-
MI vs GT: నాలుగో వికెట్ డౌన్.. విష్ణు వినోద్ ఔట్
ముంబయి నాలుగో వికెట్ కోల్పోయింది. మోహిత్ శర్మ బౌలింగ్ లో వినోద్ క్యాచ్ ఔటయ్యాడు.
-
MI vs GT: 13 ఓవర్లకు 131 పరుగులు..
13 ఓవర్లు ముగిసేసరికి ముంబయి 131 పరుగులు చేసింది.
-
MI vs GT: భారీ స్కోర్ దిశగా ముంబయి
ముంబయి భారీ స్కోర్ దిశగా ముందుకు సాగుతుంది. సూర్య కుమార్, విష్ణు వినోద్ సిక్సులు, ఫోర్లతో రాణిస్తున్నారు.
-
MI vs GT: మూడో వికెట్ డౌన్.. రషీద్ మాయజాలం
రషీద్ ఖాన్ మూడో వికెట్ తీశాడు. నెహల్ వదేరాను క్లీన్ బౌల్డ్ చేశాడు.
-
MI vs GT: ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. ఓపెనర్లు ఔట్
రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. ఓపెనర్లు ఇద్దరిని ఔట్ చేశాడు.
-
MI vs GT: ముగిసిన పవర్ ప్లే.. 61 పరుగులు
పవర్ ప్లే లో ముంబయి ధాటింగా బ్యాటింగ్ చేసింది. వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది.
-
MI vs GT: 5 ఓవర్లు.. 51 పరుగులు
ఐదు ఓవర్లకు ముంబయి 51 పరుగులు చేసింది. ఓపెనర్లు ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు.
-
MI vs GT: 4 ఓవర్లు.. 44 పరుగులు
నాలుగు ఓవర్లకు ముంబయి 44 పరుగులు చేసింది. ఓపెనర్లు ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు.
-
MI vs GT: ధాటిగా ఆడుతున్న ఓపెనర్లు
ముంబయి ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. అవకాశం వచ్చినపుడు ఫోర్లు, సిక్సర్లుతో చెలరేగిపోతున్నారు.
-
MI vs GT: తొలి ఓవర్.. 6పరుగులు
షమీ వేసిన తొలి ఓవర్లో 6 పరుగులు వచ్చాయి.
-
MI vs GT: క్రీజులోకి ఇషాన్, రోహిత్
మహమ్మద్ షమీ తొలి ఓవర్ వేస్తున్నాడు.
-
MI vs GT: గుజరాత్ బౌలింగ్.. టీం ఇదే
వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, నూర్ అహ్మద్
-
MI vs GT: ముంబయి బ్యాటింగ్.. జట్టు ఇదే
ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, విష్ణు వినోద్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ
-
MI vs GT: టాస్ గెలిచిన గుజరాత్
టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముంబై మొదట బ్యాటింగ్ చేయనుంది.