Last Updated:

Hyderabad News : హైదరాబాద్ లో దారుణం.. అంత్యక్రియలకు డబ్బుల్లేక సొంత సోదరుడిని ముక్కలుగా నరికిన అన్నాచెల్లెళ్ళు

హైదరాబాద్ లోని దారుణ గహతన చోటు చేసుకుంది. స్థానిక లంగర్ హౌస్ లో నివసించే సొంత సోదరుడిని ముక్కలుగా నరికారు అతని అన్నాచెల్లెళ్లు. తర్వాత సదరు వ్యక్తి మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి.. సమీపం లోని ఓ దర్గా దగ్గర పడేసి వెళ్లారు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా ఇప్పుడు కలకలం రేపుతుంది. మొదట గోనె

Hyderabad News : హైదరాబాద్ లో దారుణం.. అంత్యక్రియలకు డబ్బుల్లేక సొంత సోదరుడిని ముక్కలుగా నరికిన అన్నాచెల్లెళ్ళు

Hyderabad News : హైదరాబాద్ లోని దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక లంగర్ హౌస్ లో నివసించే సొంత సోదరుడిని ముక్కలుగా నరికారు అతని అన్నాచెల్లెళ్లు. తర్వాత సదరు వ్యక్తి మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి.. సమీపం లోని ఓ దర్గా దగ్గర పడేసి వెళ్లారు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా ఇప్పుడు కలకలం రేపుతుంది. మొదట గోనె సంచిలో మృత దేహాన్ని గుర్తించిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టి సీసీ టీవి ఫుటేజ్ లు గమనించగా ఎవరో వచ్చి ఆ గోనె సంచిని దర్గా దగ్గర పడేయడం గమనించారు. ఆ కోవలో విచారణ చేపట్టిన పోలీసులకు షాక్ అయ్యే నిజాలు తేలడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మద్యానికి బానిసై తమ సోదరుడు చనిపోయాడని, అంత్యక్రియలకు డబ్బుల్లేక ఇలా చేశామని నిందితులు ఇద్దరూ చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

లంగర్ హౌస్ కు చెందిన అశోక్, రాజు, స్వరూప ఒకే కుటుంబానికి చెందినవారు. అశోక్ గతంలో అనారోగ్య కారణాలతో డాన్ బాస్కో హాస్పిటల్ లో చికిత్స పొందాడు. చికిత్స చేసినా ఇక లాభం లేదని, పరిస్థితి క్షీణించడంతో అతన్ని ఇంటికి తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో అశోక్ అనారోగ్యంతో కన్నుమూశాడు. అయితే అతనికి అంత్యక్రియలు నిర్వహించకుండ.. ఆశోక్ శరీరాన్ని రాజు, స్వరూప కలిసి ముక్కలు ముక్కలుగా చేశారు. ఆ తర్వాత గోనె అశోక్ మృత దేహాన్ని సంచిలో కుక్కి ఆటోలో తీసుకొచ్చి లంగర్ హౌస్ లోని దర్గా దగ్గర పడేశారు. స్థానికులు గమనించి ఏమిటని అడగ్గా.. సమాధానం చెప్పకుండా ఇద్దరూ ఆటోలో అక్కడి నుంచి జారుకున్నారు.

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. గోనె సంచిలో డెడ్ బాడీ ఉన్నట్లు గుర్తించారు. ముక్కలుగా నరికి పాలిథిన్ కవర్ లో శరీర భాగాలను మూటగట్టినట్లు తెలిసింది. పోలీసులు ఆ ఇద్దరిని సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నారు. ఆశోక్ అంత్యక్రియలకు డబ్బులు లేక మృతదేహాన్ని పారేయటానికి ముక్కలుగా నరికానని అతని సోదరుడు రాజు విచారణలో వెల్లడించాడు. అతనిపై పోలీసులు 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆశోక్ నిజంగానే మద్యానికి బానిసై చనిపోయడా? లేక అన్నాచెల్లెళ్లు కలిసి ఆశోక్ ను చంపేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అశోక్ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఇప్పుడు జంట నగరాల్లో హాట్ టాపిక్ గా మారింది.