Toshakhana case: ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ రిలీఫ్ .. తోషాఖానా కేసులో ప్రొసీడింగ్స్ నిలిపివేత
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వివాదాస్పద తోషాఖానా కేసులో ఊరట లభించింది. ఈ అంశాన్ని విచారించిన ఇస్లామాబాద్ హైకోర్టు దీనిపై స్టే విధించింది.. కోర్టు తన తీర్పును వెలువరిస్తూ, తోషఖానా కేసుకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్ పై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై నిలుపుదల ఉత్తర్వు జారీ చేసింది
Toshakhana case: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వివాదాస్పద తోషాఖానా కేసులో ఊరట లభించింది. ఈ అంశాన్ని విచారించిన ఇస్లామాబాద్ హైకోర్టు దీనిపై స్టే విధించింది..
కోర్టు తన తీర్పును వెలువరిస్తూ, తోషఖానా కేసుకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్ పై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై నిలుపుదల ఉత్తర్వు జారీ చేసింది. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌పై నేరారోపణ చెల్లుబాటు కాదని ప్రకటించింది.
ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చట్టవిరుద్దం..(Toshakhana case)
అంతకుముందు గురువారం మాజీ ఇమ్రాన్ ఖాన్ అరెస్టు చట్టవిరుద్ధమని పాకిస్థాన్ సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే.అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో 01.05.2023 తేదీన నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) ఛైర్మన్ జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను అమలు చేసిన విధానం చెల్లదు మరియు చట్టవిరుద్ధంఅని సుప్రీంకోర్టు పేర్కొంది. అర్థరాత్రి జారీ చేసిన లిఖితపూర్వక ఉత్తర్వులలో పేర్కొంది.అంతకుముందు విచారణ సందర్భంగా, ఈ కేసులో ముందస్తు బెయిల్ పొందేందుకు ఖాన్ హైకోర్టుకు లొంగిపోయినందున, అతని అరెస్టుతో అంతరాయం ఏర్పడిన పాయింట్ నుండి మొత్తం ప్రక్రియ ప్రారంభించాలని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇది కోర్టు ధిక్కారమే..
నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో న్యాబ్ కోర్టు ధిక్కార నేరానికి పాల్పడిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిందితుడిని అరెస్టు చేయడానికి ముందు కోర్టు రిజిస్ర్టార్ అనుమతి తీసుకొని అరెస్ట చేయాలని అన్నారు. కోర్టు సిబ్బందిని కూడా కొన్నిసార్లు దుర్భాషలాడుతారని సీజేపీ అన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి కోర్టు అందుబాటులో ఉంటుందని.. స్వేచ్చగా సురక్షితంగా కోర్టును ఆశ్రయించి న్యాయం పొందవచ్చునని పాకిస్తాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు.