అయితే ఇలా రైస్ తోపాటు కొన్ని ఆహారాలు కలిపి తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అన్నంతో పాటు పొటాటో కర్రీ, పొటాటో ఫ్రై తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఈ రెండింటినీ కలిపి అస్సలు తీసుకోకూడదట. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీ కంటెంట్ ఎక్కువగా పెరుగుతుంది.
సలాడ్స్ ఆరోగ్యానికి మంచి చేస్తాయి. కానీ, ఆహారం తీసుకున్న వెంటనే మాత్రం సలాడ్స్ అస్సలు తీసుకోకూడదు. అరుగుదల సమస్య ఉన్నవారికి ఇది చాలా అనారోగ్యం
చాలా మందికి టీ తాగడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ, రైస్ తిన్న తర్వాత టీ అస్సలు తాగకూడదట. దీని వల్ల కూడా బ్లోటింగ్ సమస్యలు ఎక్కువగా వస్తాయట.
చాలా మంది భోజనం చేసిన వెంటనే పండ్లు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కానీ రైస్ తిన్న వెంటనే పండ్లు అస్సలు తినకూడదట. దీని వల్ల అరుగుదల సమస్యలు వస్తాయి.
చాలా మందికి రైస్ తో భోజనం చేసిన తర్వాత మొక్క జొన్న, బఠాణి వంటి వాటిని తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవాశం ఉందట.