Last Updated:

PBKS vs MI: దంచికొట్టిన లివింగ్ స్టోన్.. ముంబై టార్గెట్ 215 రన్స్

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ముందు పంజాబ్ భారీ స్కోర్ ఉంచింది. లివింగ్ స్టోన్, జితేష్ శర్మ దంచికొట్టడంతో జట్టు స్కోరు నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులుగా ఉంది. దానితో ముంబై ఇండియన్స్ టార్గెట్ 215 రన్స్.

PBKS vs MI: దంచికొట్టిన లివింగ్ స్టోన్.. ముంబై టార్గెట్ 215 రన్స్

PBKS vs MI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ముందు పంజాబ్ భారీ స్కోర్ ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో కింగ్స్ జట్టు  214 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్ ((82 నాటౌట్‌; 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాటౌట్ గా నిలిచాడు. హాఫ్ సెంచరీకి ఒక అడుగు దూరంలో జితేశ్ శ‌ర్మ‌(49 నాటౌట్; 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ) నాటౌట్ గా నిలిచాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో జట్టు స్కోర్ 214గా ఉంది. దానితో ముంబై ఇండియన్స్ టార్గెట్ 215 రన్స్ గా ఉంది. ఐపీఎల్‌ 2023లో భాగంగా పంజాబ్ మొహాలీ వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో హోంటౌన్లో పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డుతోంది. ఇకపోతే ముంబై బౌలర్స్ పీయూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా, అర్షద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.

ఈ సీజ‌న్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ ఐదు మ్యాచుల్లో విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో ఉండగా ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ముంబై నాలుగు మ్యాచుల్లో గెలిచి ఏడో స్థానంలో ఉంది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 03 May 2023 09:16 PM (IST)

    ముంబై ఇండియన్స్ టార్గెట్ 215

    పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగులు చేశారు. దానితో ముంబై ఇండియన్స్ టార్గెట్ 215రన్స్ గా ఉంది.

  • 03 May 2023 09:07 PM (IST)

    లివింగ్ స్టోన్ వరుస సిక్సులు

    లైమ్ లివింగ్ స్టోన్ వరుస సిక్సులు బాదాడు. 18 ఓవర్లో ఆర్చర్ వేసిన బంతులను వరుసగా సిక్సులగా మలచాడు లివింగ్ స్టోన్.

  • 03 May 2023 09:00 PM (IST)

    లివింగ్ స్టోన్ హాఫ్ సెంచరీ

    లివింగ్ స్టోన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 32 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోర్ 171/3. క్రీజులో జితేష్, లివింగ్ స్టోన్ ఉన్నారు.

  • 03 May 2023 08:44 PM (IST)

    15 ఓవర్లు: పంజాబ్ స్కోర్ 145/3

    15 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోర్ 145/3. క్రీజులో జితేష్, లివింగ్ స్టోన్ ఉన్నారు.

  • 03 May 2023 08:27 PM (IST)

    షార్ట్ ఔట్

    పీయూష్ బౌలింగ్లో 26 బంతుల్లో 27 పరుగులు చేసి మాథ్యూ షార్ట్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోర్ 95/3.

  • 03 May 2023 08:20 PM (IST)

    10 ఓవర్లు: పంజాబ్ స్కోర్ 78/2

    10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోర్ 78/2. ప్రస్తుతం క్రీజులో షార్ట్, లివింగ్ స్టోన్ ఉన్నారు.

  • 03 May 2023 08:07 PM (IST)

    శిఖర్ ఔట్

    పీయూష్ చావ్లా బౌలింగ్లో 20 బంతుల్లో 30 పరుగులు చేసి కెప్టెన్ శిఖర్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోర్ 62/2

  • 03 May 2023 08:00 PM (IST)

    పవర్ ప్లే: పంజాబ్ స్కోర్ 50/1

    పవర్ ప్లే ముగిసే సరికి పంజాబ్ స్కోర్ 50/1. ప్రస్తుతం క్రీజులో శిఖర్, షార్ట్ ఉన్నారు.

  • 03 May 2023 07:58 PM (IST)

    5 ఓవర్లు: పంజాబ్ స్కోర్ 40/1

    5 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోర్ 40/1. క్రీజులో శిఖర్ ధావన్, షార్ట్ ఉన్నారు.

  • 03 May 2023 07:39 PM (IST)

    మొదటి వికెట్ కోల్పోయిన పంజాబ్

    7 బంతుల్లో 9 పరుగులు చేసి ప్రభ్ సిమ్రన్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోర్ 13/1.

  • 03 May 2023 07:37 PM (IST)

    మొదటి ఓవర్ 9 పరుగులు

    మొదటి ఓవర్లో 9 పరుగులు రాబట్టారు. ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్, కెప్టెన్ శిఖర్ ధావన్.

  • 03 May 2023 07:25 PM (IST)

    తుది జ‌ట్లు ఇవే

    ముంబై ఇండియన్స్ తుది జ‌ట్టు

    రోహిత్ శర్మ(కెప్టెన్‌), ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వల్, అర్షద్ ఖాన్

    పంజాబ్ కింగ్స్ తుది జ‌ట్టు

    ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్‌), మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీప‌ర్‌), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

  • 03 May 2023 07:24 PM (IST)

    టాస్ గెలిచిన ముంబై

    టాస్ గెలిచిన ముంబై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దానితో పంజాబ్ జట్టు బ్యాటింగ్ కు దిగనుంది.