వాముతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా
వాముతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా Health benefits of Ajwain seeds

వాము చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.

దగ్గు, జలుబును తగ్గేందుకు కూడా వాము ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. శ్లేష్మాన్ని సులభంగా తొలగించడానికి, మూసుకుపోయిన ముక్కు నుంచి ఉపశమనం కలిగించడానికి వాము సహాయపడుతుంది.

ఈ విత్తనాల్లోని థైమోల్ రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది.

ఉదర సమస్యను తగ్గించేందుకు వాము అద్భుతంగా పని చేస్తుంది.

వాము గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. కడుపు నొప్పి, అసౌకర్యం వంటి దీర్ఘకాలిక అజీర్ణ సమస్యలను నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది.

ఉబ్బసాన్ని తగ్గించడానికి వాము బాగా ఉపయోగపడుతుంది.

వాములో నియాసిన్, థయామిన్, సోడియం, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

ఈ విత్తనాలలో ఎక్కువ మొత్తంలో డైటరీ ఫైబర్, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.

మూసుకుపోయిన నాసికా మార్గాలను తెరవడానికి ఇది ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇది ఊపిరితిత్తుల గాలి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
