Hyderabad Metro: నేడు రాత్రి రెండు గంటలవరకూ మెట్రో రైళ్లు తిరుగుతాయి..
గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
Hyderabad: గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
గణేష్ నిమజ్జనం రోజున ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మెట్రో రైలు సమయాన్ని పొడిగిస్తున్నాం. చివరి మెట్రో రైలు సెప్టెంబర్ 10న ఒంటి గంటకు బయలుదేరి దాదాపు రెండు గంటల సమయంలో సంబంధిత స్టేషన్లకు చేరుకుంటుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం ఆరుగంటల నుంచి మెట్రో సేవలు యధావిధిగా నడుస్తాయి. ప్రయాణికులు సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని మెట్రో ఎండి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్బంగా 10వేల మంది జిహెచ్ఎంసి సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. గణేష్ విగ్రహాల నిమజ్జనంలో కార్యక్రమ పర్యవేక్షణకు 168 మంది అధికారులను నియమించారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరిస్తున్నారు.