Tholi Ekadasi: రేపు తొలి ఏకాదశి
తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ''తొలి ఏకాదశిగా'' గా పిలుస్తారు. దీనికే ''శయనైకాదశి'' అని ''హరి వాసరమని'' పేరు.
తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ”తొలి ఏకాదశిగా” గా పిలుస్తారు. దీనికే ”శయనైకాదశి” అని ”హరి వాసరమని” పేరు.
శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని, అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే కార్తీకశుద్ద ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు,.
తొలి ఏకాదశిరోజున సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి విష్ణువును పూజించాలి. చక్కెరపొంగలిని నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలి. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.తొలిఏకాదశినాడు మొక్కజొన్న పేలాలను మొత్తటి పొడిగా దంచి అందులో నూరినబెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. ఇలాచేస్తే విష్ణువు అనుగ్రహానికి పాత్రులవుతారు. ఏకాదశివ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించినవారు సమస్త బాధలనుంచి విముక్తిపొందుతారని మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొన్నారు.