CSK vs KKR: చెన్నై భారీ స్కోర్.. కోల్ కతా లక్ష్యం 236 పరుగులు
CSK vs KKR: టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో సీఎస్కే 8 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, కేకేఆర్ 4 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది.
CSK vs KKR: చెన్నై భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 235 పరుగులు చేసింది. చెన్నై బ్యాటింగ్ లో అజింక్యా రహానే విధ్వంసం సృష్టించాడు. కేవలం 29 బంతుల్లో 71 పరుగులు చేశాడు. శివం దూబే, కాన్వే కూడా అర్దసెంచరీలతో రాణించారు. ఇక చివర్లో జడేజా 8 బంతుల్లో 18 పరుగులు చేశాడు. దీంతో చెన్నై భారీ స్కోర్ సాధించింది.
కోల్ కతా బౌలర్లలో.. కెర్జోలియా రెండు వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.
LIVE NEWS & UPDATES
-
KKR vs CSK: చెన్నై భారీ స్కోర్.. కోల్ కతా లక్ష్యం 236 పరుగులు
చెన్నై భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 235 పరుగులు చేసింది. చెన్నై బ్యాటింగ్ లో అజింక్యా రహానే విధ్వంసం సృష్టించాడు. కేవలం 29 బంతుల్లో 71 పరుగులు చేశాడు. శివం దూబే, కాన్వే కూడా అర్దసెంచరీలతో రాణించారు. ఇక చివర్లో జడేజా 8 బంతుల్లో 18 పరుగులు చేశాడు. దీంతో చెన్నై భారీ స్కోర్ సాధించింది.
కోల్ కతా బౌలర్లలో.. కెర్జోలియా రెండు వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.
-
KKR vs CSK: భారీ స్కోర్ దిశగా చెన్నై.. 18 ఓవర్లకు 199 పరుగులు
చెన్నై భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 18 ఓవర్లకు చెన్నై 199 పరుగులు చేసింది. రహానే, దుబే అర్ద సెంచరీలతో రాణించారు.
-
KKR vs CSK: 15ఓవర్లకు 160 పరుగులు చేసిన చెన్నై
15 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 160 పరుగులు చేసింది. క్రీజులో దుబే, రహానే ఉన్నారు.
-
KKR vs CSK: చెన్నై విధ్వంసం.. వరుస సిక్సులు
చెన్నై బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు సిక్సులు వచ్చాయి.
-
CSK vs KKR: రెండో వికెట్ కోల్పోయిన చెన్నై.. కాన్వై ఔట్
చెన్నై సూపర్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. చక్రవర్తి బౌలింగ్ లో కాన్వే క్యాచ్ ఔటయ్యాడు. 40 బంతుల్లో 56 పరుగులు చేశాడు కాన్వే.
-
CSK vs KKR: తొలి వికెట్ కోల్పోయిన చెన్నై.. గైక్వాడ్ క్లీన్ బౌల్డ్
చెన్నై సూపర్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. సూయాష్ బౌలింగ్ లో గైక్వాడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
-
CSK vs KKR: ముగిసిన పవర్ ప్లే.. 59 పరుగులు చేసిన చెన్నై
పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై 59 పరుగులు చేసింది.
-
CSK vs KKR: బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై.. క్రీజులోకి గైక్వాడ్, కాన్వే
ఉమేష్ యాదవ్ తన తొలి ఓవర్ వేస్తున్నాడు.
-
CSK vs KKR: కోల్ కతా జట్టు ఇదే
జగదీశన్, జాసన్ రాయ్, నితీశ్ రాణా(కెప్టెన్), రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, డేవిడ్ వైస్, కుల్వంత్ ఖేజ్రోలియా, సుయాశ్ శర్మ, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
-
CSK vs KKR: ధోని సేన జట్టు ఇదే
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివం దూబే, రవీంద్ర జడేజా, ధోనీ(కెప్టెన్), మతీషా పతిరణా, తుషార్ దేశ్ పాండే, మహేశ్ తీక్షణ