Last Updated:

100 coin: రూ.100 కాయిన్ ను విడుదల చేయనున్న కేంద్రం

మన దేశంలో ఇప్పటివరకు 1,2,5,10,20 నాణేలను చలామణి చేశాం. అయితే త్వరలో భారత మార్కెట్ లోకి రూ.100 కాయిన్ విడుదల కానుంది.

100 coin: రూ.100 కాయిన్ ను విడుదల చేయనున్న కేంద్రం

100 coin: మన దేశంలో ఇప్పటివరకు 1,2,5,10,20 నాణేలను చలామణి చేశాం. అయితే త్వరలో భారత మార్కెట్ లోకి రూ.100 కాయిన్ విడుదల కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్ ’ కార్యక్రమం 100 ఎపిసోడ్ పూర్తి చేసుకోబోతుంది. ఈ నెల 30 న మన్ కీ బాత్ 100 ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ సందర్భంగా మోదీ రూ. 100 నాణేలను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. 2014 అక్టోబర్ 3న ప్రధాని మోదీ ‘మనకీ బాత్‌’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రతి నెల చివరి ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.

ఈ క్రమంలో రూ. 100 కాయిన్‌ రిలీజ్ పై కేంద్ర ఆర్ధిక శాఖ అధికారిక ప్రకటన చేసింది. ఈ 100 రూపాయిల నాణెం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తయారైంది. ఈ విలువైన నాణెం కేంద్రం ప్రభుత్వం నిర్వహిస్తున్న మనకీ బాత్‌ 100 వ ఎపిసోడ్ కార్యక్రమంలో విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.

 

100 కాయిన్ విశేషాలివే..(100 coin)

ఏప్రిల్ 30 న విడుదల కానున్న ఈ రూ. 100 కాయిన్ పై మెక్రోఫోన్ సింబల్ తో పాటు 2023 అని ప్రింట్ చేసి ఉంటుంది. మన్ కీ బాత్ సందర్భంగా కేవలం ఒకే ఒక రూ. 100 కాయిన్ మాత్రమే ప్రింట్ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ కాయిన్ వెండి, రాగి, నికెల్, జింక్ తో తయారు చేశారు. కాయిన్ కు ముందు వైపు అశోక స్థంభం, దాని కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. ఒక వైపు ఇండియా అని రాయగా.. రూపీ అనే సింబల్ కూడా ఉంటుంది. మెక్రో ఫోన్ సింబల్ తో పాటు సౌండ్ వేవ్స్ సింబల్ కూడా ఆర్బీఐ ప్రింట్ చేయనుంది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ‘Mann Bat Ki Batt 100’ అని ప్రింట్ చేయనున్నారు. ఈ రూ. 100 కాయిన్ బరువు 35 గ్రాములు ఉండనుంది.

 

ఇది తొలిసారి కాదు

అయితే రూ. 100 నాణేన్ని విడుదల చేయడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఈ కాయిన్ ను ఆర్బీఐ ప్రింట్ చేసింది. అటల్ బిహారీ వాజ్ పేయూ స్మారకార్థం ప్రధాని మోదీ రూ. 100 కాయిన్ ను విడుదల చేశారు. రాజ్ మాత విజయ్ రాజ్ సిందియా శత జయంతి సందర్భంలో, మహారాణ ప్రతాప్ 476 వ జయంతి సందర్భంలోనూ 100 కాయిన్ ఫ్రింట్ అయింది. 2010, 2011, 2012,2014, 2015 లో 100 కాయిన్స్ ను కేంద్రం ప్రింట్ చేయించింది.