Last Updated:

Fan War Murder : అత్తిలిలో పవన్, ప్రభాస్ ల ఫ్యాన్ వార్.. స్నేహితుడిని కొట్టి చంపిన దారుణ ఘటన

భాషతో సంబంధం లేకుండా సినిమా హీరోలంతా మేమే మేము బాగానే ఉంటాం.. మీరు కూడా బాగుండాలి అని బహిరంగంగానే చెబుతున్నారు. అభిమానం హద్దులు దాటితే అది ఎవరికి మంచిది కాదు. సినిమా హీరోలపై అభిమానం ఉండటంలో తప్పు లేదు కానీ, అది హద్దు మీరితేనే లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. గతంలో కూడా పలు సందర్భాలలో

Fan War Murder : అత్తిలిలో పవన్, ప్రభాస్ ల ఫ్యాన్ వార్.. స్నేహితుడిని కొట్టి చంపిన దారుణ ఘటన

Fan War Murder : భాషతో సంబంధం లేకుండా సినిమా హీరోలంతా మేమే మేము బాగానే ఉంటాం.. మీరు కూడా బాగుండాలి అని బహిరంగంగానే చెబుతున్నారు. అభిమానం హద్దులు దాటితే అది ఎవరికి మంచిది కాదు. సినిమా హీరోలపై అభిమానం ఉండటంలో తప్పు లేదు కానీ, అది హద్దు మీరితేనే లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. గతంలో కూడా పలు సందర్భాలలో హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగాయి, కొట్టుకున్నారు. కానీ ఇప్పుడు కాలం మారింది, పరిస్థితులు మారాయి, అందరు కలిసి భాషలతో సంబంధం లేకుండా ఇండియన్ సినిమా అని గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా కానీ అభిమానులే అభిమానాన్ని హద్దులు దాటించి ఒక్కోసారి సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఫ్యాన్ వార్ చివరికి ఒక వ్యక్తి ప్రాణాలను బలి తీసుకునే వరకు వచ్చింది.

ఏలూరుకు చెందిన హరికుమార్, కిషోర్‌లు భవనాలకు రంగులు వేస్తుంటారు. మూడు రోజుల క్రితం అదే పనిపై అత్తిలి వచ్చారు. స్థానిక మసీదు వీధిలోని నజీర్ అనే వ్యక్తి ఇంటికి పెయింట్స్ వేస్తూ అదే భవనంపై నిద్రిస్తున్నారు. ప్రభాస్ అభిమాని అయిన హరికుమార్..  ఏలూరులో ప్రభాస్ అభిమానుల సంఘానికి కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఈ మేరకు హరి తన వాట్సాప్ స్టేటస్‌గా ప్రభాస్ వీడియోను పెట్టుకున్నాడు.

తమ అభిమాన హీరోల గురించి ఇద్దరు పెయింటర్ల మధ్య ఘర్షణ తలెత్తి.. అది కాస్తా హత్యకు దారి తీసిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏలూరుకు చెందిన పెయింటర్లు అత్తిలి మసీదు వీధిలో నజీర్ అనే వ్యక్తి ఇంటికి పెయింట్స్ వేస్తూ ఘర్షణ పడ్డారు. ఇక మరో పెయింటర్ కిషోర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని. నేను పవన్ ఫ్యాన్ ని, నువ్వు కూడా ప్రభాస్ వీడియో తీసి పవన్ వీడియోని స్టేటస్ గా పెట్టుకో అని హరికుమార్ ను.. కిషోర్ కోరాడు. దానికి హరికుమార్ ఒప్పుకోకపోగా.. నేను ప్రభాస్ కి వీరాభిమానిని, ప్రభాస్ వీడియోనే పెట్టుకుంటాని తేల్చి చెప్పాడు. అప్పటికే ఇద్దరూ మద్యం మత్తులో ఉండడంతో మాటామాటా పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది.

ఆ గొడవ ఇద్దరూ కొట్టుకునే వరకు వెళ్లడంతో.. హరికుమార్ కోపంతో సెంట్రింగ్ కర్రతో కిషోర్ తలపై బలంగా కొట్టాడు. అలానే సిమెంటు రాయితో ముఖం మీద కొట్టాడు. దీంతో తీవ్రగాయాలతో కిషోర్ అక్కడికక్కడే చనిపోయాడని తెలుస్తుంది. ఈ ఘటన తర్వాత హరికుమార్ అక్కడి నుంచి పారిపోగా రంగంలోకి దిగిన తణుకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న హరికుమార్ ను అరెస్ట్ చేశారు. అభిమాన ఉండడంలో తప్పులేదు కానీ.. హద్దులు దాటిన అభిమానంతో ఈ రకంగా స్నేహాన్ని కూడా మర్చిపోయి.. హత్య చేసే వరకు దారి తీయడం పట్ల అందరూ షాక్ అవుతున్నారు. ఇటువంటి ఘటనల పట్ల సగటు ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు కూడా పెదవి విరుస్తున్నారు.