MI vs PBKS: పంజాబ్ భారీ స్కోర్.. ముంబయి లక్ష్యం 215 పరుగులు
MI vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
MI vs PBKS: పంజాబ్ భారీ స్కోర్ సాధించింది. మెుదట్లో తడబడిన ఆ జట్టు చివరి ఐదు ఓవర్లలో 95 పరుగులు చేసింది. సామ్ కరణ్, భాటియా ఆకాశమే హద్దుగా చెలరేగారు. చివర్లో జితేష్ 7 బంతుల్లో 25 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సిక్సులు ఉండటం విశేషం.
ముంబయి బౌలర్లలో గ్రీన్, చావ్లా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అర్చర్, జేసన్, టెండూల్కర్ తలో వికెట్ తీసుకున్నారు.
LIVE NEWS & UPDATES
-
MI vs PBKS: పంజాబ్ భారీ స్కోర్.. ముంబయి లక్ష్యం 215 పరుగులు
పంజాబ్ భారీ స్కోర్ సాధించింది. మెుదట్లో తడబడిన ఆ జట్టు చివరి ఐదు ఓవర్లలో 95 పరుగులు చేసింది. సామ్ కరణ్, భాటియా ఆకాశమే హద్దుగా చెలరేగారు. చివర్లో జితేష్ 7 బంతుల్లో 25 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సిక్సులు ఉండటం విశేషం.
ముంబయి బౌలర్లలో గ్రీన్, చావ్లా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అర్చర్, జేసన్, టెండూల్కర్ తలో వికెట్ తీసుకున్నారు.
-
MI vs PBKS: సామ్ కరణ్ అర్దసెంచరీ.. భారీ స్కోర్ దిశగా పంజాబ్
పంజాబ్ కెప్టెన్ సామ్ కరణ్ అర్దసెంచరీ సాధించాడు. 26 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 4సిక్సులు ఉన్నాయి. కరణ్ ఇది ఐపీఎల్ లో మూడో అర్దసెంచరీ.
-
MI vs PBKS: ఒకే ఓవర్లో నాలుగు సిక్సులు..
గ్రీన్ వేసిన ఓవర్లో నాలుగు సిక్సులు వచ్చాయి. మెుదటి రెండు సిక్సులను భాటియ కొట్టగా.. చివరి రెండు బంతులను జితేష్ సిక్సర్లుగా మలిచాడు.
-
MI vs PBKS: సిక్సుల వర్షం.. భాటియా క్లీన్ బౌల్డ్
పంజాబ్ బ్యాటర్లు సిక్సుల వర్షం కురిపించారు. టెండూల్కర్ ఓవర్లో 31 పరుగులు చేయగా.. గ్రీన్ వేసిన ఓవర్లో వరుసగా రెండు సిక్సులు వచ్చాయి. ఆ తర్వాతి బంతికే భాటియా క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ప్రస్తుతం పంజాబ్ భారీ స్కోర్ దిశగా ముందుకు సాగుతుంది.
-
MI vs PBKS: 16వ ఓవర్లో భారీగా పరుగులు.. 31 పరుగులు సమర్పించుకున్న టెండూల్కర్
అర్జున్ టెండూల్కర్ వేసిన 16వ ఓవర్లో భారీగా పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో రెండు సిక్సులు, మూడు ఫోర్లు వచ్చాయి. సామ్ కరణ్, భాటియా చెలరేగి ఆడారు.
-
MI vs PBKS: ముగిసిన 14వ ఓవర్.. 105 పరుగులు చేసిన పంజాబ్
14ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 105 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కరణ్, భాటియ ఉన్నారు.
-
MI vs PBKS: కట్టుదిట్టంగా ముంబయి బౌలింగ్.. 12ఓవర్లకు 89 పరుగులు
మంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో 12 ఓవర్లకు పంజాబ్ 89 పరుగులు చేసి.. నాలుగు వికెట్లు కోల్పోయింది.
-
MI vs PBKS: ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. కష్టాల్లో పంజాబ్
పంజాబ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. చావ్లా బౌలింగ్ లో వివింగ్ స్టన్ స్టంపౌట్ అయ్యాడు. తర్వాతి రెండు బంతులకే అతర్వ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
-
MI vs PBKS: మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్..లివింగ్ స్టన్ స్టంపౌట్
పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. పియూష్ చావ్లా బౌలింగ్ లో వివింగ్ స్టన్ స్టంపౌట్ అయ్యాడు.
-
MI vs PBKS: రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్.. ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఔట్
పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ లో సిమ్రాన్ సింగ్ ఎల్ బీడబ్యూ రూపంలో ఔటయ్యాడు. సింగ్ 17 బంతుల్లో 26 పరుగులు చేశాడు.
-
MI vs PBKS: ముగిసిన పవర్ ప్లే.. 58 పరుగులు చేసిన పంజాబ్
పవర్ ప్లే లో పంజాబ్ ధాటిగా ఆడింగి. 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సింగ్, అతర్వ టైడ్ ఉన్నారు.
-
MI vs PBKS: ముగిసిన నాలుగో ఓవర్.. ఒకే ఓవర్లో రెండు సిక్సులు
నాలుగో ఓవర్లకు పంజాబ్ 36 పరుగులు చేసింది. బెహరెండఫ్ వేసిన ఓవర్లో ప్రభ్ సిమ్రాన్ సింగ్ రెండు సిక్సులు కొట్టాడు.
-
MI vs PBKS: తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్.. షార్ట్ క్యాచ్ ఔట్
పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. కామెరున్ గ్రీన్ బౌలింగ్ లో షార్ట్ క్యాచ్ ఔటయ్యాడు.
-
MI vs PBKS: ముగిసిన రెండో ఓవర్.. 13 పరుగులు చేసిన పంజాబ్
రెండో ఓవర్ ముగిసేసరికి పంజాబ్ 13 పరుగులు చేసింది.
-
MI vs PBKS: క్రీజులోకి షార్ట్.. ప్రభ్ సిమ్రాన్ సింగ్
పంజాబ్ బ్యాటింగ్ ప్రారంభించింది. తొలి ఓవర్ అర్జున్ టెండుల్కర్ వేస్తున్నాడు.
-
MI vs PBKS: బ్యాటింగ్ కి దిగిన పంజాబ్.. జట్టు ఇదే
అథర్వ తైడే, ప్రభ్ సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్(కెప్టెన్), జితేశ్ శర్మ, హర్ ప్రీత్ సింగ్ భాటియా, షారుక్ ఖాన్, హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
-
MI vs PBKS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి.. జట్టు ఇదే
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, జాసన్