IPL 2023 RCB vs PBKS: సిరాజ్ బంతాట.. పంజాబ్ పై ఆర్సీబీ విజయం
ఐపీఎల్ 2023 సీజన్ 16లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ బరిలోకి దిగింది. ఈ సీజన్లో రెండు జట్లు చెరో ఐదు మ్యాచులు ఆడాయి కాగా పంజాబ్ మూడు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా ఆర్సీబీ రెండు మ్యాచుల్లో గెలిచి ఎనిమిదో స్థానంలో ఉంది.
IPL 2023 RCB vs PBKS: 24 పరుగుల తేడాతో పంజాబ్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఐపీఎల్ 2023 సీజన్ 16లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ముఖాముఖి తలపడ్డాయి. టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కి సిరాజ్ రూపంలో చుక్కెదురయ్యింది. సిరాజ్ బంతుల ధాటికి పంజాబ్ కింగ్స్ కుప్పకూలిపోయారు. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు 18.2 ఓవర్లలో కేవలం 150 పరుగుల మాత్రమే చేసి ఆలౌటైంది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్ 46, జితేశ్ శర్మ 41 పరుగులతో రాణించగా మిగిలిన వారు వచ్చినవారు వచ్చినట్టే పెవిలియన్ బాట పట్టారు. ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా, హసరంగా రెండు వికెట్లు, పార్నెల్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 174 పరుగులు చేసింది. డుప్లెసిస్డుప్లెసిస్(84), విరాట్ కోహ్లీ(59)పరుగుల వర్షం కురిపించారు. చెరో హాఫ్ సెంచరీ తమ ఖాతాలో వేసుకున్నారు. దినేశ్ కార్తిక్(7), మాక్స్వెల్(0)లు అంతగా రాణించలేకపోయారు. ఇక పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ రెండు వికెట్లు తీయగా నాథన్ ఎల్లిస్, అర్ష్దీప్ సింగ్ లు చెరో వికెట్ పడగొట్టారు.
LIVE NEWS & UPDATES
ఇవి కూడా చదవండి:
- Salaar: ఆర్సీబీ జట్టుపై పై సలార్ మూవీ టీం ట్వీట్.. నెట్టింటా వైరల్
- Mumbai Indians: ఈ సారి ముంబై ఫైనల్ చేరడం కష్టమేనా.. ఈ లోపాలే రోహిత్ సేనకు బలహీనత