Apple Saket: ఢిల్లీలో యాపిల్ సాకేత్ ను ప్రారంభించిన టిమ్ కుక్
భారత్ లో స్టోర్ ను ప్రారంభించడం కోసం సీఈఓ టిమ్ కుక్ ఏప్రిల్ 17 నే ఇక్కడికి చేరుకున్నారు. అనంతరం ఏప్రిల్ 18 న ముంబైలో యాపిల్ బీకేసీ ని ప్రారంభించారు.
Apple Saket: దిగ్గజ ఎలక్ట్రానిక్స్ దిగ్జం యాపిల్ భారత్ లో రెండో స్టోర్ ను గురువారం ప్రారంభించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ కు యాపిల్ సాకేత్ గా పేరు పెట్టారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసేందుకు యాపిల్ వినియోగదారులతో పాటు ఢిల్లీ వాసులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ సందర్భంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్వయంగా కస్టమర్లను ఆహ్వానించారు. ఆయనతో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ లు తీసుకునేందుకు కస్టమర్లు ఆసక్తి చూపారు. రెండు రోజుల క్రితం(ఏప్రిల్ 18న) ముంబై లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్ లో యాపిల్ బీకేసీ పేరుతో తొలి స్టోర్ ను లాంచ్ విషయం తెలిసిందే.
70 మంది అనుభవజ్ఞులతో..
కాగా ఢిల్లీ స్టోర్ ను సెలెక్ట్ సిటీవాక్ మాల్ లో ఏర్పాటు చేశారు. ముంబై స్టోర్ తో పోలిస్తే ఢిల్లీ స్టోర్ విస్తీర్ణంలో తక్కువైనట్టు తెలుస్తోంది. ఈ స్టోర్ లో 70 మంది అనుభవజ్ఞులైన యాపిల్ ప్రతినిధులు సేవలు అందించనున్నారు. 18 రాష్ట్రాలకు చెందిన వీరు మొత్తం 15 భాషల్లో కస్టమర్లకు సేవలు అందించగలరు. భారత్‌లో స్టోర్లు తెరవడం, కొత్త పర్యావరణహిత కార్యక్రమాలు చేపట్టడం సంస్థ కీలక మైలురాయి అని యాపిల్ పేర్కొంది. భారత్ లో రూపొందించిన రెండు స్టోర్లు ఇక్కడి వినియోగదారులకు కొత్త అనుభూతిని అందిస్తాయని కంపెనీ తెలిపింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వేలాది ఉద్యోగాల కల్పించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పింది.
#WATCH | Apple CEO Tim Cook meets customers visiting India’s second Apple Store at Delhi’s Select City Walk Mall in Saket. pic.twitter.com/ZeEubKU92w
— ANI (@ANI) April 20, 2023
భారత్ లో మరిన్ని పెట్టుబడులు
భారత్ లో స్టోర్ ను ప్రారంభించడం కోసం సీఈఓ టిమ్ కుక్ ఏప్రిల్ 17 నే ఇక్కడికి చేరుకున్నారు. అనంతరం ఏప్రిల్ 18 న ముంబైలో యాపిల్ బీకేసీ ని ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నేంద్ర మోదీని కలిశారు. భారత్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉన్నట్టు కుక్ పేర్కొన్నారు. తమ విడిభాగాల తయారీ సంస్థలకు భారత్ లో విస్తరించేందుకు ప్రభుత్వాన్ని టిమ్ కుక్ సపోర్ట్ కోరినట్టు సమాచారం.